కమెడియన్‌ కు దర్శకుడి వార్నింగ్‌

Update: 2019-06-13 01:30 GMT
తమిళ సినిమా స్థాయిని మాత్రమే కాకుండా ఇండియన్‌ సినిమా స్థాయినే హాలీవుడ్‌ రేంజ్‌ కు తీసుకు వెళ్లిన ప్రముఖ దర్శకుడు శంకర్‌. రోబో మరియు 2.ఓ చిత్రాలతో హాలీవుడ్‌ స్థాయి టెక్నాలజీని ఇండియన్‌ ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. అంతటి గొప్ప దర్శకుడిని ఇటీవల తమిళ కమెడియన్‌ వడివేలు నోటికి వచ్చినట్లుగా మాటలన్న విషయం తెల్సిందే. దర్శకుడు శంకర్‌ కు గ్రాఫిక్స్‌ తప్ప మరేం చేతకాదని కేవలం ఆయన గ్రాఫిక్స్‌ వల్లే పేరు తెచ్చుకున్నాడని వడివేలు వాగాడు.

శంకర్‌ సినిమాల దర్శకుడిగా కాకుండా గ్రాఫిక్స్‌ డైరెక్టర్‌ గా చెప్పుకోవాలని నోటికి వచ్చినట్లుగా మాట్లాడేశాడు. వడివేలుకు శంకర్‌ కు గత కొన్ని రోజులుగా వివాదం నడుస్తుంది. అందుకే ఈస్థాయిలో విరుచుకు పడి విమర్శలు చేశాడు. అయితే శంకర్‌ వంటి దిగ్గజ దర్శకుడిని వడివేలు విమర్శించడంపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ప్రముఖ దర్శకుడు వెంకట్‌ ప్రభు ఈ విషయమై స్పందించాడు.

దర్శకుడు అంటే కెప్టెన్‌ ఆఫ్‌ ది షిప్‌ అంటారు. అలాంటి దర్శకుడికి నటీనటులు అంతా కూడా సముచిత గౌరవం ఇవ్వాలి. ఒక సినిమా హిట్‌ అయితే అందరికి మంచి పేరు వస్తుంది.. కాని ఫ్లాప్‌ అయితే దర్శకుడే ఆ చెడ్డ పేరును మోయాల్సి ఉంటుంది. అలాంటి దర్శకుడికి గౌరవం తప్పకుండా ఇవ్వాలి. నీ కెరీర్‌ లో సాధించిన విజయాల్లో శంకర్‌ సినిమాలు కీలకం అనే విషయం నువ్వు గుర్తించాలి. తమిళ సినిమా స్థాయిని ఎంతో ఎత్తుకు తీసుకు వెళ్లిన గొప్ప దర్శకుడు శంకర్‌. ఆయన గురించి తప్పుగా మాట్లాడటం ఆయన్ను అవమానించడం ఎంత మాత్రం కరెక్ట్‌ కాదని మరోసారి అలాంటి వ్యాఖ్యలు చేయవద్దని వెంకట్‌ ప్రభు సీరియస్‌ గా వడివేలుకు వార్నింగ్‌ ఇచ్చాడు. ఈమద్య కాలంలో అవకాశాలు తగ్గడంతో వడివేలు చిన్న విషయానికి కూడా ఎక్కువగా రియాక్ట్‌ అయ్యి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నాడు. తాజాగా శంకర్‌ విషయంలో కూడా అదే జరిగింది.
Tags:    

Similar News