టాప్ స్టోరి: ఎంత‌వార‌లైన గానీ..!

Update: 2019-05-15 01:30 GMT
ద‌ర్శ‌కుడు ఒక క‌థ రెడీ చేసుకోవ‌డం దానిని టార్గెటెడ్ హీరోకి వినిపించ‌డం అటుపై నిర్మాత ఓకే చేయ‌డం ఇదంతా ఓ పెద్ద ప్రాసెస్. ఇది ఒక‌ప్పుడు చాలా సులువుగా ఉండేది. హీరోలు వెంట‌నే ఓకే చెప్పేవారు. అగ్ర హీరో ఓకే చెప్ప‌గానే ఆ సినిమాని నిర్మించేందుకు పేరున్న‌ నిర్మాత‌లు వాలిపోయేవారు. హీరో స్టార్ డ‌మ్.. ద‌ర్శ‌కుడి రేంజును బ‌ట్టి పెట్టుబ‌డులు పెట్టేందుకు వెన‌కాడేవారు కాదు. ఇదివ‌ర‌కూ ఇలాంటి కాంబినేష‌న్లు వెంట‌నే సెట్ట‌యిపోయేవి. కానీ ఇప్పుడు స‌న్నివేశం మారింది. మునుప‌టిలా వెంట‌నే ఏ హీరో గుడ్డిగా న‌మ్మి ప్రాజెక్టుకు సంత‌కం చేయ‌డం లేదు. క‌థ ద‌గ్గ‌ర నుంచి.. ద‌ర్శ‌కుడి ఎంపిక‌లో గ‌త ట్రాక్ రికార్డు నుంచి గ‌త స‌క్సెస్ రేటు .. మార్కెటింగ్ చేయ‌డానికి ఉన్న స్కోప్ .. ఇలా అన్నిటినీ భేరీజు వేసుకున్న త‌ర్వాత‌నే ఓకే చెబుతున్నారు. ఇదివ‌ర‌క‌టిలా స్నేహం కోస‌మో.. మొహమాటం కోస‌మో సినిమాకి ఓకే చెప్పేయ‌డం లేదు. ఈ స‌న్నివేశంలో ఫ్లాపుల్లో ఉన్న ద‌ర్శ‌కులు వెంట‌నే అవ‌కాశం ద‌క్కించుకోవ‌డం అన్న‌ది అంత ఈజీగా కుద‌ర‌డం లేదు.

ఇక‌పోతే ఇండ‌స్ట్రీ హిట్టు సెంటిమెంటు వెంట ప‌డుతుంద‌ని ద‌ర్శ‌కుడు తేజ స‌హా ఎంద‌రో చెప్పారు. ఇక్క‌డ నియ‌మాలేవీ ఉండ‌వు. హిట్టు మాత్ర‌మే నిర్ణ‌యిస్తుంది. కాబ‌ట్టి ఆ ఒక్క హిట్టు ఇవ్వ‌క‌పోతే ప‌రిశ్ర‌మ ఎంత పెద్ద ద‌ర్శ‌కుడిని అయినా న‌మ్మ‌దు అనేందుకు క‌ళ్ల ముందే ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ‌లు ఉన్నాయి. ఇటీవ‌లే ఓ సెన్సేష‌న‌ల్ హిట్ తీసి .. అటుపై వ‌రుస‌గా యువ‌హీరోల‌తో ఫ్లాపులు తీసి బుక్క‌యిన ద‌ర్శ‌కుడే అందుకు ఉదాహ‌ర‌ణ‌. ఆయ‌న ఇప్ప‌టికే ప‌లువురు అగ్ర హీరోల‌కు క‌థ‌లు వినిపించారు. ఎలాగైనా ఓ హిట్టు కొట్టి తిరిగి ట్రాక్ లోకి రావాల‌ని త‌పిస్తున్నారు. కానీ అందుకు టైమ్ రావ‌డం లేదు. అయితే ఈలోగానే ప‌లువురు హీరోల‌తో సినిమాలు ఖాయ‌మ‌య్యాయంటూ ప్ర‌చారం ఊద‌ర‌గొట్టేయ‌డం చూస్తున్న‌దే. ఇప్ప‌టికే ముగ్గురు స్టార్ హీరోల్ని సంప్ర‌దిస్తే ఓచోట క‌థ రిజెక్ట్ అయ్యింది. మ‌రోచోట చూద్దాం అన్నంత వ‌ర‌కూ వ‌చ్చి ఆగింది. ఇంకో చోట క‌థ చెప్పారు.. గోయింగ్ అన్నంత‌వ‌ర‌కూ వ‌చ్చింది. అయితే ఇవేవీ ఠెంకాయ కార్య‌క్ర‌మం చేసేవర‌కూ ఖాయ‌మేన‌ని చెప్ప‌లేని స‌న్నివేశం నెల‌కొంద‌ని తాజాగా ఫిలింన‌గ‌ర్ లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

ప్ర‌స్తుతం మారిన హీరోల మైండ్ సెట్ తో స‌ద‌రు ద‌ర్శ‌కుడు చాలానే తంటాలు ప‌డుతున్నాడ‌ట‌. హిట్టు లేని ప‌రిశ్ర‌మ‌లో హిట్టివ్వ‌ని ద‌ర్శకుల్ని న‌మ్మే ప‌రిస్థితి లేదు.  హిట్టు సెంటిమెంటు అంత బ‌లంగా ప‌ని చేస్తోంది. ఇక‌పోతే వేరొక స్టార్ డైరెక్ట‌ర్ సైతం ఇలానే స్ట్ర‌గుల్ ని ఎదుర్కొంటున్నారు. ఆయ‌న ఏదోలా తెగించి నిర్మాత‌లు ఫైనాన్షియ‌ర్ల‌ను వెతికి .. చివ‌రికి త‌న ఆస్తుల్ని తాక‌ట్టు పెట్టి ఏదో ఒక‌టి చేసి ఒక్క హిట్టు కొట్టాల‌ని త‌పిస్తున్నారు. అలాగే త‌న‌యుడిని పెద్ద స్టార్ ని చేయాల‌ని భావిస్తున్నారు. కానీ ఇవేవీ వెంట‌నే నెర‌వేర‌ని స‌న్నివేశం క‌నిపిస్తోంది. అయితే దేనినైనా డిసైడ్ చేసేది ఒక్క హిట్టు మాత్ర‌మే. ఆ హిట్టు ద‌క్కేవ‌ర‌కూ వేచి చూడాల్సి ఉంటుంది. ఆ ఒక్క హోప్ తోనే ఇక్క‌డ బ‌త‌కాల్సి ఉంటుంది. అంత‌వ‌ర‌కూ స్టార్ డైరెక్ట‌ర్లు అయితే కాస్తంత గౌర‌విస్తారు. ప‌ల‌క‌రిస్తారు త‌ప్ప ఛాన్సులైతే మొహ‌మాట ప‌డి ఇచ్చేయ‌రు. ఇటీవ‌లే ఇండ‌స్ట్రీ హిట్టిచ్చిన అగ్ర ద‌ర్వ‌కుడు సుకుమార్ స‌న్నివేశాన్ని వేరొక కోణంలో విశ్లేషించాల్సి ఉంటుంది. వ‌రుస‌గా డిజాస్టర్లు ఇచ్చాను .. అవ‌కాశాలివ్వ‌లేదు అంటూ తేజ‌లా డైరెక్టుగా అంగీక‌రించ‌లేని వాళ్లు ఎంద‌రో ఉన్నారు. హిట్టును త‌ప్ప దేనినీ చూడ‌రు ఇక్క‌డ అని తేజ కుండ‌బ‌ద్ధ‌లు క‌ట్టారు. ఇదీ టాలీవుడ్ లో క‌నిపిస్తున్న తాజా స‌న్నివేశం.

  
  
  


Tags:    

Similar News