షారుఖ్ ఖాన్ నిఖార్సయిన హిట్టు కొట్టి చాలా కాలమే అయి ఉండొచ్చు. కానీ అతడి బాక్సాఫీస్ స్టామినా గురించి మాత్రం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ‘హ్యాపీ న్యూ ఇయర్’ లాంటి ఫ్లాప్ మూవీతో కూడా తొలి రోజు కలెక్షన్ల రికార్డుల్ని బద్దలు కొట్టడం కింగ్ ఖాన్ బాక్సాఫీస్ స్టామినాను తెలియజేసేదే. ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన షారుఖ్ సినిమా ‘రయీస్’ కూడా నెగెటివ్ టాక్‌తో మొదలైనప్పటికీ మంచి ఓపెనింగ్సే తెచ్చుకుంది. తొలి రోజు ఇండియాలో రూ.21 కోట్ల దాకా వసూలు చేసింది. అది కూడా హృతిక్ రోషన్ మూవీ ‘కాబిల్’తో పోటీ పడి. కానీ షారుఖ్ లేటెస్ట్ మూవీ ‘జబ్ హ్యారీ మెట్ సెజాల్’ పోటీ లేకుండా సోలోగా విడుదలై కూడా తొలి రోజు దేశవ్యాప్తంగా రూ.15 కోట్లు మాత్రమే వసూలు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఈ సినిమాపై ముందు నుంచి పెద్దగా హైప్ లేకపోగా.. టాక్ కూడా ఆశించిన స్థాయిలో రాలేదు. దీంతో ఓపెనింగ్స్ పై ఎఫెక్ట్ బాగానే పడింది. రూ.15 కోట్లు మాత్రమే వసూలయ్యాయి తొలి రోజు. వరల్డ్ వైడ్ వసూళ్లు చూసుకున్నా రూ.20 కోట్లకు అటు ఇటుగా ఉంటాయేమో. గత కొన్నేళ్లలో ఏ షారుఖ్ సినిమాకూ ఇలాంటి ఓపెనింగ్స్ రాలేదు. నెగెటివ్ టాక్ బాగా స్ప్రెడ్ అవుతున్న నేపథ్యంలో శని.. ఆదివారాల్లోనూ ఈ చిత్రం పెద్దగా పుంజుకుంటుందన్న ఆశలు కనిపించట్లేదు. ఇక వీకెండ్ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో అంచనా వేయడం కష్టం కాదు. ఇది షారుఖ్ సొంత సినిమా కావడం విశేషం. షారుఖ్ సొంతంగా ఎప్పుడు సినిమా చేసినా.. దాన్ని భలేగా మార్కెట్ చేసుకుంటాడు. డబ్బులు రాబట్టుకుంటాడు. ‘రావన్’ లాంటి డిజాస్టర్ మూవీకి కూడా లాభాలందుకున్న చరిత్ర అతడిది. కానీ ‘జబ్ హ్యారీ మెట్ సెజాల్’ మాత్రం షారుఖ్ కు నష్టాలు తెచ్చి పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.