సినిమా నచ్చకపోతే నచ్చలేదని క్రిటిక్స్ విమర్శిస్తే దానికి ఫిలింమేకర్స్ హర్షించకపోవచ్చు కానీ.. సమీక్షల్ని ఫాలో అయ్యేవాళ్లు హర్షిస్తారు. సినిమా బావుంటే బావుందని రాసే సమీక్షకులు కంటెంట్ లేని సినిమాని బాలేదని విమర్శించేస్తే హర్టయ్యేవాళ్లుంటారు. కానీ అన్నిటికీ ప్రేక్షకులే సరైన సమాధానం ఇస్తారు. ఇటీవల రిలీజైన సినిమాల్లో ఉప్పెన-నాంది లాంటి చిత్రాలకు క్రిటిక్స్ ప్రశంసలు దక్కాయి. జనం థియేటర్లకు వచ్చి ఆదరించారు.
ప్రస్తుతం జాతిరత్నాలు చిత్రం కలెక్షన్ల దుమారం సృష్టిస్తోంది. ఈ సినిమాకి విమర్శకుల ప్రశంసలతో పాటు జనాదరణ దక్కింది. అయితే దీంతో పాటే రిలీజైన గాలి సంపత్ డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడమే గాక క్రిటిక్స్ నుంచి తీవ్ర విమర్శల్ని ఎదుర్కొంది. ఎట్టకేలకు ఆ సినిమాని థియేటర్ల నుంచి తొలగించి ఆ స్థానంలో జాతి రత్నాలుకు థియేటర్లను కేటాయిస్తున్నారని ట్రేడ్ లో టాక్ వినిపిస్తోంది.
దర్శకుడు అనీల్ రావిపూడి సమర్పకుడిగా రచయితగా వస్తున్న సినిమాగా భారీ హైప్ మధ్య థియేటర్లలోకి వచ్చింది. కానీ ఇది మొదటి రోజు నుండి విఫలమైంది. సోమవారం నాటికి పూర్తిగా కలెక్షన్లు జీరో అయిపోయాయని తెలుస్తోంది. చాలా సెంటర్లలో ఈ చిత్రాన్ని థియేటర్ల నుండి తొలగించారని తెలుస్తోంది.
అయితే నిర్మాతల సన్నివేశం ఏమిటి? అన్నదానిపైనా ట్రేడ్ లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా రిలీజ్ కి ముందే బిజినెస్ పరంగా సేఫ్ అని ప్రకటించినా కానీ..ట్రేడ్ లో విశ్లేషణ వేరేగా ఉందని తెలుస్తోంది.