మాస్ రాజా రవితేజ సినిమాల మీద గత కొన్నేళ్లలో జనాలకు ఆసక్తి తగ్గిపోతూ వచ్చింది. పెద్ద పెద్ద స్టార్లందరూ కూడా రొటీన్ మాస్ మసాలా సినిమాలు వదిలిపెట్టి కొత్త కథల వైపు చూస్తుంటే రవితేజ మాత్రం మూస కథల్ని పట్టుకుని వేలాడాడు. దీంతో అతడికి బాక్సాఫీస్ దగ్గర దారుణమైన పరాభవాలు తప్పలేదు. మార్కెట్ దెబ్బ తినేసి, ఫాలోయింగ్ పడిపోయి కెరీరే ప్రమాదంలో పడే పరిస్థితుల్లో కానీ అతను ఓ భిన్నమైన కథను ఎంచుకోలేక పోయాడు. ఆ సినిమానే.. డిస్కో రాజా. ఎక్కడికి పోతావు చిన్నవాడా లాంటి సెన్సేషనల్ మూవీ అందించిన వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. ఐతే మొదట్లో ఈ సినిమాపై పెద్దగా అంచనాలులేవు కానీ. దీని టీజర్ చూశాక ఒక్కసారిగా హైప్ వచ్చింది.
రవితేజను చాలా కొత్తగా ప్రెజెంట్ చేసే ప్రయోగాత్మక చిత్రంలా కనిపించింది డిస్కోరాజా టీజర్. మాస్ రాజా ఇంత స్టైలిష్ గా, ఎనర్జిటిగ్గా కొత్తగా ఈ మధ్య కాలంలో కనిపించ లేదు. తాజాగా సంక్రాంతి కానుక గా రెండో టీజర్ వదిలారు. ఇది కూడా కొత్తగా, ఎగ్జైటింగ్ గానే కనిపిస్తోంది. ప్రేక్షకుల్లో ఒక క్యూరియాసిటీ తెచ్చేలా టీజర్ కట్ చేశారు. సినిమాలో ఏదో ఉంది అనే ఫీలింగ్ మరోసారి కలిగించడం లో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. తొలి టీజర్లో మాదిరే ఇందులోనూ రవితేజ చాలా కాన్ఫిడెంట్ గా, మంచి ఎనర్జీ తో కనిపించాడు. వరుసగా అన్ని ఫ్లాపుల తర్వాత ఇంత కాన్ఫిడెన్స్,ఎనర్జీ చూపించడం ఆశ్చర్యమే. అతడి ఆత్మవిశ్వాసం చూస్తే ఈసారి గట్టిగా కొట్టబోతున్నాడనే ఫీలింగ్ కలుగుతోంది. సంక్రాంతి సందడి ముగిశాక రాబోయే చిత్రమిది. జనవరి 24న రిలీజ్.