పోయినోళ్ళంతా మంచోళ్లు. కాబట్టి ఇప్పటికే పరమపదించిన సీనియర్ కమెడియన్ల గురించి మనం ఎటువంటి కామెంట్లు చేయబోవట్లేదు. ఇప్పటికే ఎమ్మెస్ నారాయణ.. ఏవిఎయస్.. ఆహుతి ప్రసాద్.. ధర్మవరపు.. కొండవలస.. మొదలగు కమెడియన్లు చనిపోవడం తెలుగు ఇండస్ర్టీకి తీరని నష్టం అంటూ చెప్పుకున్నాం. ఇకపోతే మాడా.. కళ్లు చిదంబరం.. పెద్దగా ఇప్పుడు ఫాం లో లేకపోయినా కూడా.. వారి మరణం కూడా నష్టమేనని అనుకోవడం జరిగింది. ఇదంతా బాగానే ఉంది. కాని ఇక్కడ మరో విషయం చర్చించాలి.
కమెడియన్ల కులానికి తీరని నష్టం జరిగింది అని అనుకోవడం భావ్యం కాదేమో. ఎందుకంటే ఎవరైనా కూడా ఎప్పుడో ఒకసారి ఈ లోకాన్ని వీడాల్సిందే. పైగా పైన చెప్పిన నటులందరూ మినిమంలో మినిమం 30 సంవత్సరాలు టాలీవుడ్ లో జండా పాతేశారు. ఇక్కడ వినిపిస్తున్న మరో యాంగిల్ ఏంటంటే.. అసలు కొత్త కమెడియన్లకు ఛాన్సులు ఇవ్వకుండా ఆ పాత కమెడియన్లనే ఎందుకు ఇంతకాలం రుద్దుతూ వచ్చారు.. అంటున్నారు జనాలు. కొత్త తరంలో సునీల్ ఒక్కడే తప్పించి.. ఒక సినిమాను పూర్తిగా నడిపించేంత స్థాయిలో ఎవ్వరూ లేరు. 30 ఇయర్స్ పృథ్వి.. సప్తగిరి.. వెన్నెల కిషోర్.. తాగుబోతు రమేష్.. వీళ్లవెవ్వరూ ఒక సినిమాను సింగిల్ హ్యాండ్ గా నడిపించలేరు. ఎందుకంటే అలాంటి క్యారెక్టర్లు వారికి ఎప్పుడూ మనోళ్లు ఇచ్చిందే లేదు. ఎంతసేపూ బ్రహ్మానందం చుట్టూతానే తిరుగుతున్నారు.
లేదంటే అప్పట్లో ఎమ్మెస్ - ధర్మవరపు - ఏవియెస్ వంటి దిగ్గజాలు చేసిన పాత్రలు ఇప్పటి తరానికి దక్కట్లేదు మరి. సో.. ఓ రకంగా చెప్పాలంటే.. కొత్త వారిని ఎంకరేజ్ చేసుంటే పాత తరం అనివార్య కారణాల వలన మనకు అందుబాటులో లేనప్పుడు పెద్దగా ఫీలవ్వాల్సిన అవసరం ఉండదు. హీరో హీరోయిన్ల విషయంలో ఎంకేరేజ్ చేసినంత కొత్తదనాన్ని కమెడియన్ల విషయంలో చేయరు మనోళ్లు.. కాదంటారా?