డాక్టర్‌గా నటించాలంటే మెడిసిన్‌ చదవాలా?

Update: 2015-04-14 11:10 GMT
సుహాసిని మణిరత్నం .. పరిచయమే అక్కర్లేని పేరు ఇది. తెలుగు, తమిళ్‌ ప్రేక్షకులకు బాగా సుపరిచితమైన మేటి కథానాయిక. ఇటీవలి కాలంలో తెలుగు సినిమాల్లో నటించడానికి ప్రాధాన్యతను తగ్గించిన సుహాసిని భర్త మణిరత్నం తెరకెక్కించే సినిమాల ప్రమోషన్‌ పనులు, ప్రొడక్షన్‌ పనులు చూసుకుంటున్నారు. సొంత బ్యానర్‌ మద్రాస్‌ టాకీస్‌లో 23ఏళ్లుగా సినిమాలు తీస్తున్నారు.

ఇటీవలే 'ఒకే బంగారం' తమిళ వెర్షన్‌ ఆడియోలో సుహాసిని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రివ్యూలు రాసేవాళ్లు అర్హులైతేనే రాయాలి. ఎవరు బడితే వారు రాయకూడదు అని అన్నారు. సమీక్షలు రాసేవాళ్లకు కనీస అర్హత తప్పనిసరి అని అన్నారు. అంతేకాదు నటన సహా ఇతర సాంకేతిక విషయాల్లో సుశిక్షితుల్ని ఎలా ఎంచుకుంటామో సమీక్షకుల్ని కూడా అలా తయారు చేయాలని సెలవిచ్చారు. అయితే దీనిపై సోషల్‌ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. నాలుగేళ్ల ఎంబీబీఎస్‌ కోర్స్‌ పూర్తి చేస్తేనే డాక్టరుగా నటించాలా లేకపోతే బైక్‌ స్టంట్స్‌ నేర్చుకుంటేనే హీరోలు బైక్‌ నడపాలా? అంటూ ఒక విమర్శకుడు సామాజిక వెబ్‌సైట్లలో కౌంటర్‌ వేశాడు.

అంతేకాదు ప్రజాస్వామ్యంలో ఎవరి అభిప్రాయం వాళ్లు స్వేచ్ఛగా రాసుకోవచ్చు. మాపైనా ఆంక్షలా అని దుమ్ము దులిపేశారు కొందరు. సుహాసిని గారూ.. ఏం అర్హత ఉందని సినిమాటోగ్రఫీని వదిలేసి నటి (చదివిన కోర్సు ఒకటి, చేసిన వ్యాపకం ఇంకొకటి) అయ్యారు? ఆ మాత్రం స్వేచ్ఛ రాసేవాళ్లకు ఉండనక్కర్లేదా?
Tags:    

Similar News