స్టార్ హీరోల సినిమాలు స్టార్ట్ చేసిన తర్వాత ఫ్యాన్స్ ఫస్ట్ ఆసక్తిగా చూసేది టైటిల్ ఏం పెడతారా అని. ఫిలిం మేకర్స్ కూడా చాలావరకు అభిమానుల అంచనాలు.. స్టార్ ఇమేజ్ ను దృష్టిలో ఉంచుకుని టైటిల్స్ పెడుతూ ఉంటారు. కొన్నిసార్లు మాత్రం ఫ్యాన్స్ ఏ మాత్రం ఊహించని టైటిల్స్ పెట్టి డైరెక్టర్లు సర్ ప్రైజ్ ఇస్తూ ఉంటారు. తాజాగా ఇద్దరు డైరెక్టర్లు దాదాపుగా ఒకేటైంలో ఇలాంటి సర్ ప్రైజ్ ఇచ్చారు.
బాలకృష్ణ హీరోగా పూరి జగన్నాథ్ కమర్షియల్ ఫిలిం తీస్తున్నారు. మాఫియా బ్యాక్ గ్రైౌండ్ లో తెరకెక్కుతున్న ఈ సిినిమాలో బాలకృష్ణ డాన్ క్యారెక్టర్ చేస్తున్నాడని టాక్. యాక్షన్ ఎపిసోడ్స్ హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో భారీగా తీశారు. ఈ సినిమాకు నాలుగైదు టైటిల్స్ పేర్లు వినిపించాయి. ఉస్తాద్ అన్నది అభిమానులకు బాగానే కనెక్టయింది కానీ ఎవరూ ఊహించని విధంగా పూరి జగన్నాథ్ పైసా వసూల్ టైటిల్ ఫిక్స్ చేశాడు. సినిమా బాగానే ఉంది, యావరేజ్ అనే అర్ధంలో వాడే ఈ డైలాగ్ ను టైటిల్ గా పెట్టేయడం ఫ్యాన్స్ కు అస్సలు మింగుడు పడటం లేదు. అసలే ఈ మధ్య పూరి ట్రాక్ రికార్డు డల్ గా ఉండటం.. మూవీ స్టిల్స్ కూడా యావరేజ్ గా కనిపిస్తుండటం అభిమానులను కలవరపరుస్తోంది.
మరోవైపు రామ్ చరణ్ హీరోగా దర్శకుడు సుకుమార్ తీస్తున్న సినిమాకు రంగస్థలం 1985 సినిమా టైటిల్ ఫిక్స్ చేశారు. పేరుకు తగ్గట్టు ఆనాటి జీవన శైలిని ప్రతిబింబించేలా కావిడి బిందెలను భుజాన వేసుకుని వెళుతున్నట్లుగా రామ్ చరణ్ కనిపిస్తున్నాడు. సాధారణంగా రామ్ చరణ్ టైటిల్స్ ధృవ - ఎవడు - నాయక్ ఇలా.. అన్నీ సింపుల్ గా క్యాచీగా ఉంటాయి. గోవిందుడు అందరివాడేలే ఒక్కటే దీనికి మినహాయింపు బేసిగ్గా లెక్కల మాస్టారయిన సుకుమార్ ఈ టైటిల్ పెట్టడం వెనుక లెక్కేమిటో అభిమానులకు అర్ధంకావడం లేదు. ఇంతకుముందు సుకుమార్ తీసిన సినిమాల టైటిల్స్ కు భిన్నంగా ఉండటం 80ల నాటి కథతో సినిమా తీస్తున్నట్లు చెప్పకనే చెప్పడంతో ఈ సినిమా ఎలా ఉంటుందోనని అభిమానులు డైలమాలో పడ్డారు.
సినిమా ఆడేది కంటెంట్ ను బట్టిగాని టైటిల్ ను బట్టిగాదు. సినిమా బాగుందంటే ఆ టైటిల్ పెట్లడంలో డైరెక్టర్ ప్రయోగానికి గుర్తింపు వస్తుంది. సినిమా బాగోలేదా.. టైటిల్ కూడా ఇంకో మైనస్ పాయింట్ గా మారిపోతుంది. చూద్దాం... ఈ సినిమాలు ఎంతవరకు వర్కవటవుతాయో?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/