రెండు టైటిళ్ల‌ను క‌లిపేశారు కానీ...!

Update: 2015-08-29 10:09 GMT
రామ్‌ చ‌ర‌ణ్ సినిమా టైటిల్ గురించి ఎప్పుడూ చ‌ర్చ జ‌రిగేది. సినిమాకి కొబ్బ‌రికాయ కొట్టింది మొద‌లు... ఆ సినిమాకి పెట్ట‌బోయే పేరు గురించి విస్తృతంగా మాట్లాడుకోవ‌డం క‌నిపించింది. ఆ క్ర‌మంలో అర‌డ‌జ‌ను పేర్లు ప్ర‌చారంలోకి వ‌చ్చాయి. `మై నేమ్ ఈజ్ రాజా`, `బ్రూస్‌ లీ, `పైట‌ర్‌`, `విజేత‌` త‌దిత‌ర పేర్ల వెలుగులోకి వ‌చ్చాయి. అయితే చివ‌రిగా ఆ స‌స్పెన్స్‌ కి తెర దించుతూ `బ్రూస్‌ లీ ది ఫైట‌ర్‌` అంటూ ఖ‌రారు చేశారు. రెండు టైటిళ్ల‌ను క‌లిపి ఫిక్స్ చేశార‌న్న‌మాట‌. పేరైతే ఓకేగానీ... మాస్‌ కి మాత్రం న‌చ్చేలా లేద‌ని అభిమాన వ‌ర్గాలు మాట్లాడుకొంటున్నాయి. క‌థ రీత్యా ఆ పేరు పెట్టుండొచ్చు కానీ... అది మాస్‌ కి చేరువ‌య్యేలా ఉందా లేదా అని కూడా చూసుకోవాల్సింది. మెగా ఫ్యామిలీకి మాస్‌ లో విప‌రీత‌మైన క్రేజ్ ఉంది. `బ్రూస్‌ లీ`లాంటి పేర్లు వాళ్ల‌కు అంత‌గా ఎక్క‌వు. ఏ సెంట‌ర్స్ ప్రేక్ష‌కుల‌యితే బ్రూస్‌ లీ అంటే ఎవ‌రో గుర్తు ప‌డ‌తారు కానీ... బీ సీ సెంట‌ర్ ప్రేక్ష‌కుల‌కు మాత్రం ఆ పేరు ప‌ల‌క‌డం కూడా రాదు. మ‌రి చిత్ర‌బృందం ఎలా నిర్ణ‌యం తీసుకొందో అర్థం కాదు. `విజేత‌` అనో, పైట‌ర్ అనో పెట్టినా బాగుండేద‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

చిత్ర‌బృందం మాత్రం టైటిల్ ఇదే బాగుంద‌నీ,  ప‌ల‌క‌గా ప‌ల‌క‌గా అదే జ‌నాలకి అల‌వాటైపోతుంద‌ని చెబుతోంది. అది కూడా నిజమే కావొచ్చు. అన్నట్టు  సినిమాలో చెర్రీ  ఫైట‌ర్‌ గా క‌నిపించ‌బోతున్నాడు. చేతిపై బ్రూస్‌ లీ టాటూ వేసుకొని  క‌నిపిస్తాడు. బ్రూస్‌ లీకి, సినిమాకీ అంత అనుబంధం ఉంది కాబ‌ట్టే ఆ పేరును ఫిక్స్ చేసిన‌ట్టు అర్థ‌మ‌వుతోంది. సినిమా గురించి చ‌ర‌ణ్‌ తో పాటు టీమ్ అంతా చాలా కాన్ఫిడెంట్‌ గా ఉంది. ప్రేక్ష‌కులంద‌రికీ క‌నెక్ట్ అయ్యే అంశం ఉంద‌ని ర‌చ‌యిత గోపీమోహ‌న్ ట్విట్ట‌ర్ ద్వారా స్ప‌ష్టం చేశాడు. శ్రీనువైట్లలాంటి స్టార్ ద‌ర్శ‌కుడితో పాటు త‌న‌కి అచ్చొచ్చిన గోపీమోహ‌న్‌, కోన వెంక‌ట్ బృందం ఈ చిత్రానికి ప‌నిచేసింది కాబట్టి చాలా ఎక్స్‌ పెక్టేష‌న్స్ ఉన్నాయి. మ‌రి ఎలాంటి రిజ‌ల్ట్ సాధిస్తారో చూడాలి. ఇటీవ‌ల విడుద‌లైన టీజ‌ర్‌ కి కూడా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. చ‌ర‌ణ్ ఫైట్ల‌తో అద‌ర‌గొట్టిన‌ట్టు అర్థ‌మ‌వుతోంది.
Tags:    

Similar News