ఇంతకీ విజయ్ ఏం స్టార్?

Update: 2018-08-20 22:30 GMT
ఒక హీరోకు కొంచెం స్టార్ ఇమేజ్ రావడం ఆలస్యం.. పేరు ముందు ఏదో ఒక బిరుదు తగిలించేస్తారు అభిమానులు. సినీ కుటుంబాల నుంచి వచ్చే హీరోలకైతే తొలి సినిమాకు ముందే కూడా ఇలాంటి ట్యాగ్ లు పేరు ముందుకు వచ్చేస్తాయి. ఏ బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన హీరోల్ని కూడా వదిలిపెట్టరు. నాని ఇంకా స్టార్ ఇమేజ్ తెచ్చుకోవడానికి ముందే ‘నేచురల్ స్టార్’ అయిపోయాడు. నితిన్ యూత్ స్టార్ అయ్యాడు. వరుణ్ తేజ్ ను ‘మెగా ప్రిన్స్’ అని.. సాయిధరమ్ తేజ్ ను ‘సుప్రీమ్ స్టార్’ అని పిలిచేస్తున్నారు ఫ్యాన్స్. మరి టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ విజయ్ దేవరకొండను ఏం స్టార్ అని పిలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది. విజయ్ ‘అర్జున్ రెడ్డి’ సినిమాతోనే స్టార్ అయిపోయాడు. అతడి ఫాలోయింగ్ ఏంటన్నది తాజాగా ‘గీత గోవిందం’ విడుదలకు ముందే రుజువైంది.

ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ మామూలుగా జరగలేదు. ఇక రిలీజ్ తర్వాత అది ఎలాంటి వసూళ్ల ప్రభంజనం సృష్టించిందో తెలిసిందే. దీంతో విజయ్ మామూలు స్టార్ కాదని అందరికీ అర్థమైంది. అతడిని సూపర్ స్టార్ అంటున్నారు. స్వయంగా మెగాస్టార్ చిరంజీవే అతడినో ఓ స్టార్ గా అభివర్ణించాడు. నిజానికి విజయ్ ను మరో చిరంజీవిగా పేర్కొంటున్నారు విశ్లేషకులు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి మెగాస్టార్ అయ్యాడు చిరు. ఆయనతో పోలిక కాదు కానీ.. ఇలా బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి చాలా వేగంగా పెద్ద స్థాయికి ఎదిగిన హీరోగా చిరు తర్వాత విజయ్ నే చెప్పాలి. తెలంగాణ వాళ్లయితే అతడిని ఈ ప్రాంత మెగాస్టార్ అంటున్నారు. ఈ పిలుపుల విషయంలో విజయ్ కి పెద్దగా ఆసక్తి ఉన్నట్లుగా కనిపించదు. అతను తన అభిమానుల్ని రౌడీలు అంటారు. ఆ రకంగా చూస్తే అతడిని రౌడీ స్టార్ అనాలేమో!
Tags:    

Similar News