''బాహుబలి: ది కంక్లూజన్''.. త్వరలో రాబోయే సెకండ్ పార్టు ఇది. 2016లో వస్తోంది అంటూ రాజమౌళి అఫీషియల్‌గా ఆల్రెడీ డిక్లేర్ చేశాడు. ఇంతకీ ఈ టాపిక్ ఎందుకొచ్చింది ఇప్పుడు? ఇంకా సినిమా లవర్స్ అందరూ బాహుబలి: ది బిగినింగ్ రికార్డులను లెక్కపెట్టడంలో బిజీగా ఉన్నారు. ఆ హ్యాంగోవర్ ఇప్పుడప్పుడే వదిలేలా లేదు. చూసిన జనాలే మళ్ళీ మళ్ళీ సినిమాను చూస్తే రోజుకోరకం కామెంట్లు విసురుతూనే ఉన్నారు. సినిమాయేమో 160 కోట్లు గ్రాస్ వసూలు చేసి.. ఇంకో వంద పిండేస్తా అంటూ దూసుకుపోతోంది. ఈ సమయంలో సెకండ్ పార్టుపై చర్చ ఎందుకొచ్చిందంటే...
బాహుబలి మొదటి భాగం ఎండింగ్‌లో ఓ ట్విస్టుతో సినిమాను ముగించేశాడు రాజమౌళి. అయితే సినిమాలో ఎన్నో లీడ్స్‌ను ఓపెన్ చేశాడు కాబట్టి, కథ ఏమైయుంటుంది అనేది చాలామంది తమ ఇంటెలిజెన్స్‌ను వాడేసి గెస్ చేసేస్తున్నారు. కొందరేమో.. బాహుబలి రాజుగా ప్రమాణ స్వీకారం చేశాక బల్లాలదేవుడు కాలికేయ తమ్ముడితో కలసి మాహిష్మతిపై ఎటాక్ చేయిస్తాడని.. అప్పుడు పోరుగు దేశంలో ఉన్న రెబెల్స్ సహాయంతో యుద్దం చేసి.. ఆ రెబెల్ యువరాణి దేవసేనను బాహుబలి ప్రేమిస్తుంటాడని.. ఆమెపు కోరికను పెంచుకున్న బల్లాలదేవుడు బాహుబలికి మళ్ళీ స్కెచ్ వేసి అలగా జనంతో తిరుగుతున్నాడనే నెపంతో రాజ్యబహిష్కరణ చేయిస్తాడని.. ఆ తరువాత ఓ యుద్దంలో తెలివిగా కట్టప్పతోనే బాహుబలిని చంపిస్తాడని.. ఇలా చంపేయడానికి తల్లి శివగామి కూడా సాయం చేసి, తరువాత తప్పు తెలుసుకొని.. దేవసేనను బంధించినప్పుడు ఆమె బిడ్డను తీసుకొని క్రిందకు వచ్చేస్తుందని చెప్పుకుంటున్నారు. పోనివ్వండీ.. ఇమాజినేషనేగా.. దానికి హద్దే లేదు.
ఇకపోతే ఇలాంటి కథలు అనేకం ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఎవరికి తోచినట్లు వారు ఏదో ఒక కథను తయారు చేసుకుంటున్నారు. తోచిన కథను సోషల్ నెట్‌వర్క్‌లో చెక్కేస్తూ తమ మేథస్సుకు ఇతరులతో మార్కులు వేయించుకుంటున్నారు. ఇలాంటి కథ నిజమైదనుకోండి.. సినిమా ప్రాఫిట్స్‌లో రాజమౌళి షేర్ ఇవ్వడు కాని.. బహుశా రాజమౌళి రేంజులో ఆలోచించేశాం అని మనమే స్నేహితులతో ఒక ట్రీట్ ఇచ్చుకోవచ్చు. మన ఆనందానికి మనమే గెస్ట్ చీఫ్ గెస్ట్.. అంతే కదూ!!