పండ‌గ‌ల్ని వ‌ద‌ల‌ని బొమ్మాళీ

Update: 2018-12-26 01:13 GMT
పండ‌గొస్తే చాలు పిచ్చి పీక్స్ కు చేరుతోంది. సోష‌ల్ మీడియా వేదిక‌గా బూతు బొమ్మ‌లు ప‌బ్లిసిటీకి పెట్టి ప్ర‌చారం కొట్టేసేందుకు భామ‌ల ఉబ‌లాటం ఓ రేంజులో క‌నిపిస్తోంది. వివాదాల్ని రాజేయ‌డం ద్వారా త‌మ‌కు ప‌బ్లిసిటీ కోరుకుంటున్నారు. అయితే దీనికి ఆరంభం ఆజ్యం పోసింది మాత్రం లోఫ‌ర్ బ్యూటీ దిశా ప‌టానీ. ఈ అమ్మ‌డు దీపావ‌ళి ఫ‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని సీకే బ్రాండ్ కి ప‌బ్లిసిటీ చేసింది. ఒకే ఒక్క ఫోటోతో ఈ భామ నెటిజ‌నుల్లో జోరుగా వైర‌ల్ అయిపోయింది. ఒకే ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేసిన‌ట్టు కెల్విన్ క్లెయిన్ (సీకే) బ్రాండ్ కు ప‌బ్లిసిటీ స్ట్రాట‌జీ ఐడియానే మారిపోయింది. ప్ర‌స్తుతం ఈ బ్రాండ్ ఎక్క‌డ అంద‌గ‌త్తె క‌నిపించినా - వేడి పెంచే హొయ‌లున్నా వ‌దిలిపెట్ట‌డం లేదు. వాళ్ల‌ను సీకే లోదుస్తుల ప్ర‌చారానికి వాడేస్తోంది.

దీపావ‌ళి వెళ్లింది. క్రిస్మ‌స్ వ‌చ్చింది. మ‌ళ్లీ అదే తంతు. మ‌ళ్లీ సీకే బ్రాండ్ ప్ర‌మోష‌న్ ఓ రేంజులో సాగించారు భామ‌లు. మ‌రోసారి లోఫ‌ర్ బ్యూటీ దిశా ప‌టానీ లోదుస్తుల‌తో చెల‌రేగిపోయింది. అయితే ఈసారి మ‌రీ పండ‌గ‌ను అవ‌మానించేలా బూతు ఫోటోల్ని వాడ‌లేదు. ఆరోజు టైమింగ్ చూసి వేడెక్కించే లోదుస్తుల ఫోటోల్ని సామాజిక మాధ్య‌మాల్లోకి వ‌దిలింది.

కేవ‌లం దిశా మాత్ర‌మే కాదు, చాలామంది క‌థానాయిక‌లు ఈ పంథాను ఇప్పుడు అనుస‌రిస్తున్నారు. దీపావ‌ళి రోజు సీకే ప‌బ్లిసిటీ స్టంట్ వ‌ర్క‌వుట్ అవ్వ‌డంతో ఈసారి పూన‌మ్ పాండే శాంటా తాత‌ను అవ‌మానించే ప‌ని పెట్టుకుంది. ఈ అమ్మ‌డు శాంటా యాక్ట్ అంటూ నానా ర‌చ్చ చేసింది. బూతు వీడియోతో పండ‌గను వేడెక్కించింది. నిన్న సాయంత్రం ఈ వీడియో యువ‌త‌రం సామాజిక మాధ్య‌మాల్లో జోరుగా వైర‌ల్ అయిపోయింది. అలాగే క్రిస్మ‌స్ సెల‌బ్రేష‌న్స్‌ లో ప‌లువురు అంద‌గ‌త్తెలు సెల‌బ్రేష‌న్ మూడ్ లోకి వెళ్లిపోయారు. మ‌రీ అంత బూతు ప‌ని ఏదీ చేయ‌లేదు కానీ - ముంబై బ్యూటీ ప్ర‌గ్య జైశ్వాల్ ఓ వేడెక్కించే ఫోటోని క్రిస్మ‌స్ సాక్షిగా సామాజిక మాధ్య‌మంలో రిలీజ్ చేసింది. అయినా వీళ్లంతా ఇలాంటి ప్ర‌చారం ఎందుకు కోరుకుంటున్నారు? పండ‌గ‌లొస్తే అస‌లు ఈ బూతు ఫోజులేంటి? న‌గ్న వీడియోల‌తో ఆ ర‌చ్చేంటి? పూన‌మ్ ఇంత ఇదిగా బ‌రి తెగించాలా?
Tags:    

Similar News