ఫోటో స్టొరీ: దీపిక రిసెప్షన్ లో దిశా గ్లామర్ షో

Update: 2018-12-02 08:05 GMT
ఈమధ్యే.. అంటే నవంబర్లో బాలీవుడ్ స్టార్స్ దీపిక పదుకొనే - రణవీర్ సింగ్ వివాహం ఇటలీలో జరిగింది.  రిసెప్షన్లు.. వెడ్డింగ్ పార్టీలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇలా జరిగిన దీప్-వీర్ ల రిసెప్షన్ లో బాలీవుడ్ హాటీ దిశా పతాని తన గ్లామర్ షో తో అందరి కళ్ళను తనవైపుకు తిప్పుకుంది.  ఈ ఫంక్షన్ కు ఆమె తన బాయ్ ఫ్రెండ్ టైగర్ ష్రాఫ్ తో హాజరయింది.

ఎప్పుడైనా ఒక జంట డేటింగ్ చేస్తూ తమ ఎఫైర్ సంగతి బయటకు చెప్పకపోతే అందరి దృష్టి వారిపైనే ఉంటుంది. అలాగే దిశా-టైగర్ ల జంటపైనే అందరి దృష్టి పడిందట.  ఫోకస్ ఈ లవ్ జంటపైనే అయినా.. స్పెషల్ ఫోకస్ మాత్రం దిశా గ్లామర్ పైనేనట.  ఎందుకంటే దీప్-వీర్ ల ఫంక్షన్లో దిశా తన సోకులను వడ్డించింది కాబట్టి.  క్రీమ్ కలర్ డిజైనర్ కాస్ట్యూమ్ లో మెరిసిన దిశా తన జలకన్య టైపు గౌన్లో ఫుల్ క్లీవేజ్ షో చేసింది.  లూజ్ గా వదిలేసిన బ్రౌన్ షేడ్ లో ఉండే హెయిర్.. అతి తక్కువ యాక్సెసరీస్ తో అందరినీ ఆకర్షించింది.

ఈమధ్య కాల్విన్ క్లెయిన్ ఇన్నర్ వేర్ కు బ్రాండ్ అంబాసిడర్ గా హాటు పోజులతో సోషల్ మీడియాను వేడెక్కించడమే కాకుండా ఇలా పెళ్ళిళ్ళు.. రిసెప్షన్లలో కూడా తన తడాఖా చూపిస్తూ మిగతా బ్యూటీలను డామినేట్ చేస్తోంది.. అందుకే టైగర్ జిమ్నాస్టిక్స్ దిశా దగ్గర ఏమాత్రం పనిచెయ్యడం లేదు. వెనకాలే తిరుగుతున్నాడు.


Tags:    

Similar News