ఫోటో స్టోరీ: దిశా లోఫ‌ర్‌ త‌నం

Update: 2018-08-26 01:30 GMT
ఎదుటివాడిలో నీకు న‌చ్చే రంగు ఏది? అంటే `న‌లుపు` అని ఠ‌కీమ‌ని చెప్పేయొచ్చు. బ్లాక్ ప్ర‌భావం అలాంటిది. ఎవ‌రినైనా ఓ రేంజులో ఎలివేట్ చేస్తుంది. మెగాస్టార్ చిరంజీవికి సైతం ఎదుటివారు బ్లాక్‌ డ్రెస్ వేసుకుంటే చాలా చాలా ఇష్టం. ఇదిగో ఇక్క‌డ లోఫ‌ర్ బ్యూటీని చూశాక టీనేజీ గాళ్స్ వార్డ్‌ రోబ్ క‌లెక్ష‌న్స్‌ లో న‌లుపు రంగుకే అత్యంత ప్రాధాన్య‌త‌నివ్వ‌డం ఖాయం.

అందాల దిశాప‌టానీ ముంబై ఫ్యాష‌న్ ప్ర‌పంచంలో ఎదురేలేకుండా దూసుకుపోతుంద‌న‌డంలో సందేహం లేదు. ఈ భామ ఎక్క‌డ ఉన్నా - అక్క‌డ ఫ్యాష‌నిస్టాలు ఆగి చూడాల్సిందే. ఇదివ‌ర‌కెన్న‌డూ ఇలాంటి ఫ్యాష‌న్ చూడ‌లేదంటూ ఆ కొత్త‌ద‌నానికి మురిసిపోవాల్సిందే. నిరంత‌రం ఏదో ఒక ఫోటోషూట్‌తో సామాజిక మాధ్య‌మాల్లో అభిమానుల‌కు ట‌చ్‌ లో ఉంటూనే ఉంది కాబ‌ట్టి దిశా గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. ఎప్ప‌టిక‌ప్పుడు వేడెక్కించే ఫోటోల్ని ఇన్‌ స్టాగ్ర‌మ్‌ లో అప్‌ లోడ్ చేస్తూ హ‌డావుడి చేస్తుంటుంది.

ఆ ఫోటోషూట్‌ ల‌న్నీ ఒకెత్తు అనుకుంటే, నేడు ముంబై లాక్మే ఫ్యాష‌న్ వీక్ కోసం దిశా ప్రిపేరైన తీరు చూస్తే మ‌తిచెడాల్సిందే. న‌ల్ల కాటుక‌లో చిక్కుకున్న తెల్ల హంస‌లా ఉంది. ఆ క‌ళ్ల‌కు కాటుక దిద్ది.. సేమ్ టు సేమ్‌ కాంబినేష‌న్‌ అల్ట్రామోడ్ర‌న్ డ్రెస్‌ లో అదిరిపోయే ఫోజులిచ్చింది. మేక‌ప్ వేసుకుని డ్రెస్సింగ్ రూమ్‌ లో దిశా న‌డిచొస్తుంటే స‌ర‌దాకి తీసిన ఫోటోలే హంపీ శిల్పాలై అల‌రిస్తున్నాయి. ఈ ఫోటోల్లో ఒంపు సొంపు ఆవిష్క‌రిస్తూ దిశా ఇచ్చిన ఫోజులు మ‌తి చెడ‌గొడుతున్నాయి. మొత్తానికి లాక్మే ఈవెంట్‌ లో న‌ల్ల‌రంగు హంస‌రాణిలా క‌నిపించింది దిశా.
Tags:    

Similar News