పూన‌మ్ ఉర్ఫీ స్థాయికి దిగ‌జారిందంటూ..!

Update: 2022-08-09 15:30 GMT
తెలివి తేట‌లు ఉండాలే కానీ ఆల్మ‌రాల్లో దాచిపెట్టిన పాత గుడ్డ‌ల‌ను కూడా డిజైన‌ర్ దుస్తుల్లా మార్చేయొచ్చు. వాటి స్టైలింగ్ అవకాశాల విష‌యంలో మనం ఎంతో అజ్ఞానంతో వ్య‌వ‌హ‌రిస్తాం. అయితే అలాంటి వాటిని కూడా డిజైన‌ర్ లుక్ లోకి మార్చే ఫ్యాషనిస్టాల‌ను అభినందించి తీరాల్సిందే.

తాజాగా ఇదే త‌ర‌హాలో ఒక అంద‌మైన డిజైనర్ టాప్ ని ధ‌రించిన దిశా ప‌టానీకి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. అంత‌గా బ‌ట‌న్స్ పెట్టాల్సిన ప‌ని లేని ఇలాంటి క్రాప్ టాప్ వ్వావ్ అనిపించ‌కుండా ఉండ‌దు. ఇలా హాట్ గా ఫోజులివ్వ‌డంలో దిశా సంథింగ్ స్పెష‌ల్ అని పొగిడేయాలి.

స్ట్రెయిట్ ప‌ర్ఫెక్ట్ ఫిట్ డెనిమ్స్ కార్గో ప్యాంటు - క్రాప్ టాప్ డిజైన్ ని మరెవరూ ఇంత బ్యూటిఫుల్ గా అలంక‌రించ‌లేరు. ఇది కేవ‌లం దిశా కోస‌మే డిజైన్ చేసిన‌ది అనేంత‌గా కుదిరింది. ప‌ర్ఫెక్ట్ అసెంబుల్డ్ క్రాప్ టాప్ లో దిశా ఎంతో ట్రెండీగా కనిపిస్తోంది. మోనోటోన్డ్ మినీ-స్లీవ్డ్ టాప్ కావ‌డంతో బిగుతుగా దిశా శ‌రీరాన్ని అతుక్కుంది.

అలా సింగిల్ బ‌ట‌న్ తో మ్యానేజ్ చేస్తుంటే.. గాలికి అలా టాప్ ఎగురుతోంది.  ఈ డీప్ V-నెక్ టాప్ లో కాలర్ డిజైన్ ఆక‌ట్టుకుంది. లుక్ ప‌రంగా మ‌ల్టీ పాకెట్ స్టైల్లో అథ్లెయిజర్ లుక్ తో క‌నిపిస్తోంది. దిశా పటాని ఎల్లప్పుడూ తన ఫ్యాషన్ గేమ్ ను వైవిధ్యంగా అనుస‌రిస్తుంది. త‌న ఫాలోవ‌ర్స్ కి అన్నివేళ‌లా డ్రెస్సింగ్ సెన్స్ ప‌రంగా స్ఫూర్తిని ఇస్తుంది.

తాజా ఫోటోషూట్ చూడ‌గానే కొంద‌రు అభిమానులు మాత్రం దివాకు మద్దతుగా నిలిచారు దిశా ఎంతో సింపుల్ గా క‌నిపిస్తోందని.. వినయంగా ఉంద‌ని కూడా కొంద‌రు పొగిడేసారు. గార్జియస్ అని కూడా ప్ర‌శంస‌లు కురిపించారు. మ‌రికొంద‌రు విమ‌ర్శ‌లు గుప్పించారు.

ఈ సారి దిశా కొత్త‌ లుక్ తో చాలా మందిని ఆకట్టుకోవడంలో విఫలమైంద‌ని.. క్రాప్ టాప్.. లీజర్ ప్యాంట్ లో తన వాష్ బోర్డ్ ఆబ్స్ ని ప్ర‌ద‌ర్శించ‌డంపై నెటిజనులు తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. దిశా ఇంకా పూనమ్ పాండే స్టైల్ ను కాపీ కొడుతోంది! అని ఒకరు కామెంట్ చేయ‌గా..''యే దుస్రీ ఉర్ఫీ జావేద్ హై...'' అని ఉర్ఫీతో కూడా పోల్చారు. దిశాను పూన‌మ్ .. ఉర్ఫీల‌తో పోలుస్తూ కామెంట్లు చేసారు.  దిశా న‌టించిన ఏక్ విల‌న్ 2 ఇటీవ‌ల విడుద‌లై మిశ్ర‌మ స్పంద‌న‌లు అందుకుంది. బాక్సాఫీస్ వ‌ద్ద ఆశించిన స్థాయిలో ఆడ‌డంలో విఫ‌ల‌మైంది.
Tags:    

Similar News