ఫోటో స్టోరి: నీళ్ల‌లో జారిప‌డిన‌ చేప పిల్ల‌లా!

Update: 2022-01-02 17:30 GMT
2021కి సెండాఫ్ చెప్పి 2022లో అడుగుపెట్టేశాం. ఈసారి ఇయ‌ర్ ఎండ్ సెల‌బ్రేష‌న్స్ పీక్స్ కి చేర్చారు సెల‌బ్స్. కొత్త ఏడాది సంబ‌రాల కోసం విదేశీ విహార‌యాత్ర‌ల‌కు బీచ్ ఫెస్టివ‌ల్స్ కి ప్లాన్ చేశారు టాలీవుడ్ సెల‌బ్రిటీలు. అటు బాలీవుడ్ లోనూ బికినీ బీచ్ సెల‌బ్రేష‌న్స్ గురించి తెలిసిన‌దే. న్యూ ఇయ‌ర్ వేడుక‌ల్లో భాగంగా దిశా ప‌టానీ-టైగ‌ర్ ష్రాప్ మాల్దీవుల్లో చిలౌట్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ జంట రెండు రోజుల ముందుగానే మాల్దీవులు చేరుకుని సెల‌బ్రేషన్స్ షురూ చేసింది. తాజాగా మాల్దీవుల్లో ఎంజాయ్ చేసిన ఫోటోల్ని ఒక్కొక్క‌టిగా దిశా ప‌టాని ఇన్ స్టా వేదిక‌గా షేర్ చేస్తోంది. అంద‌మైన స‌ముద్ర తీరాన ర‌వి (సూర్యుడు) అస్త‌మిస్తోన్న స‌మ‌యంలో  టూపీస్ బికినీతో కెమెరాకి ఫోజులిచ్చిన ఫోటోలు ఇంత‌కుముందు వైర‌ల్ అయ్యాయి. దిశా ఖాతా రెడ్ హార్ట్ ఐకాన్ ల‌తో  కూడిన వ్యాఖ్య‌ల‌తో నిండిపోయింది.  ఇక టైగ‌ర్ ష్రాప్ బీచ్ వైపు న‌డుస్తోన్న వీడియో ఇటీవ‌ల‌ వైర‌ల్ అయ్యింది.

నీటిలో నుంచి బ‌య‌ట‌కు వ‌స్తూ సిక్స్ ప్యాక్  బాడీ లుక్ ని హైలైట్ చేసాడు. దిశా ప‌టానీ బీచ్ విహార యాత్ర‌ని ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డుతుంది. స‌మయం దొరికిన‌ప్పుడుల్లా మాల్దీవులు వెకేష‌న్ కి వెళ్లిపోతుంది. ఇక టైగ‌ర్ ష్రాప్ తో ల‌వ్ లో ఉన్న‌ట్లు ఇప్ప‌టికే మీడియా క‌థ‌నాలు  వేడెక్కించాయి. కానీ ఈ జంట ఆ వార్త‌ల్ని ఖండించ‌డం ప్ర‌తిసారీ కామ‌న్ గా జ‌రుగుతోంది. స్నేహితులుగా మాత్ర‌మే కొన‌సాగుతున్నామ‌ని ఇంకా అంత దూరం వెళ్లలేద‌ని చెప్ప‌కు వ‌స్తున్నారు ఈ జోడీ. తాజాగా దిశా పటానీ సోలోగా జ‌ల‌కాలాడుతున్న ఫోటో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. అలా నీళ్ల‌లో జారిపడిన చేప‌పిల్ల‌లా దిశా ఎంతో గ‌మ్మ‌త్తుగా క‌నిపిస్తోంది.

ఇక  దిశా పటానీ సినిమాల విష‌యానికి వ‌స్తే.. మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ క‌థానాయ‌కుడిగా పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన `లోఫ‌ర్` సినిమాతో ఈ బ్యూటీ టాలీవుడ్ కి ప‌రిచయ‌మైన సంగ‌తి తెలిసిందే. కానీ ఆ సినిమా అంచ‌నాల్ని అందుకోలేదు. దీంతో అమ్మ‌డు బాలీవుడ్ లోనే స్థిర‌ప‌డింది. ప్ర‌స్తుతం అక్క‌డ బిజీ న‌టిగా కొన‌సాగుతుంది. యువ హీరోల నుంచి సీరియ‌ర్ హీరోల వ‌ర‌కూ అంద‌రి స‌ర‌స‌న అవ‌కాశాలు అందుకుంటోంది. 
Tags:    

Similar News