ఇదేమైనా నైట్ డ్రెస్సా.. పేల‌వ‌మైన సెల‌క్ష‌న్..!

Update: 2022-07-17 05:30 GMT
బ్రిటీష్ సామ్రాజ్యంలో రాజులు రాణుల రిచ్ లైఫ్ స్టైల్ గురించి తెలిసిందే. ఎలిజ‌బెత్ టేల‌ర్.. ప్రిన్సెస్ డ‌యానా లాంటి రాచ‌రిక‌పు ల‌క్ష‌ణాలున్న అంద‌గ‌త్తెల గురించి ప్ర‌తిసారీ యువ‌త‌రం క‌థ‌లుగా చెప్పుకుంటుంది.

ఎవ‌రైనా న‌టి లేదా మోడ‌ల్ తాను ఎంచుకున్న డ్రెస్ లేదా స్టైలింగ్ ని బ‌ట్టి ఎలిజ‌బెత్ టేల‌ర్ లా క‌నిపించింద‌నో లేదా ప్రిన్సెస్ డ‌యానాను మ‌రిపిస్తుంద‌నో పొగిడేస్తుంటారు యూత్. ఇప్పుడు దిశా ప‌టానీ పింక్ డిజైన‌ర్ డ్రెస్ ని వీక్షించాక అచ్చం ఎలిజ‌బెత్ లా డ‌యానాలా క‌నిపిస్తోందంటూ పొగిడేస్తున్నారు. పింక్  ఫ్రాకులో ఎంతో అందంగా క‌నిపిస్తున్న ఈ బ్యూటీ ఫోటోల‌ను అంత‌ర్జాలంలో వైర‌ల్ చేస్తున్నారు.

కొంద‌రు ఈ ఫోటోలు వీక్షించాక‌.. దిశా పటానీ మళ్లీ బార్బీ డాళ్ గా మారింద‌ని వ్యాఖ్యానించ‌గా.. నెటిజన్లు పొట్టి ఫ్రాకును ట్రోల్ చేస్తున్నారు, ``పేలవమైన ఎంపికలు.. అసౌకర్యంగా ఉన్నాయి`` అని కూడా ట్రోల్ చేశారు. ప్ర‌స్తుతం దిశా యాక్షన్-థ్రిల్లర్ `ఏక్ విలన్ రిటర్న్స్` ప్రచారంలో బిజీగా ఉంది.

శనివారం ఓ ఈవెంట్ లో శాటిన్ పౌడర్ పింక్ మినీ దుస్తులను ధరించి ఉన్న దిశా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ఫ్రాక్ కి కాంబినేష‌న్ గా ముత్యాల హారం- ఉంగరాలు- తెల్లటి పాదరక్షలతో దిశా క‌నిపించింది. నెటిజ‌నులు ఈ వేషధారణపై సంతృప్తి చెందలేదు. దీనికి `పేలవమైన బట్టల ఎంపిక` అని కొంద‌రు..నైట్ డ్రెస్ లో అడుగు పెట్టడం స‌రికాద‌ని మ‌రొక‌రు వ్యాఖ్యానించారు.

దిశా పటానీ తరచుగా ఇంటర్నెట్ లో సాఫ్ట్ టార్గెట్ గా మారింది. ఇటీవల అందం కోసం శ‌స్త్ర చికిత్స చేయించుకుంద‌ని..పెదవులు .. ముక్కుకు స‌ర్జ‌రీలు చేయించుకుందనే పుకార్లతో ట్రోల‌ర్స్  త‌న‌పై క్రూరంగా దాడి చేస్తున్నారు. ఇప్పుడు పింక్ ఫ్రాకుపైనా అంతే ఇదిగా విరుచుకుప‌డుతున్నారు.
Tags:    

Similar News