బోల్డ్ నెస్ కి బ్రాండ్ అంబాసిడర్..!

Update: 2022-10-22 06:31 GMT
బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటాని ఈమధ్య కొన్నాళ్లు సైలెంట్ అవగా ఇప్పుడు మళ్లీ రెచ్చిపోతుంది. ఆమధ్య కాల్విన్ క్లైన్ లో దుస్తుల ప్రమోషన్స్ తో పిచ్చెక్కించేసిన దిశా పటాని కొద్దిగా గ్యాప్ ఇచ్చి ఇప్పుడు మళ్లీ మొదలు పెట్టేసింది. పర్ఫెక్ట్ బాడీ షేప్ తో ఎట్రాక్ట్ చేస్తున్న దిశా పటాని లేటెస్ట్ గా మరోసారి కాల్విన్ క్లైన్ ఇన్నర్ వేర్ తో ఎటాక్ చేస్తుంది. గ్లామర్ షోలో తనని మించిన వారు లేరనే విధంగా.. తన సోయగాలతో ప్రేక్షకులను ఊపిరి ఆడకుండా చేస్తుంది దిశా పటాని.       

హీరోయిన్స్ ది ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్.. వారిలో దిశాది వేరొక స్టైల్ ముఖ్యంగా అమ్మడు సినిమాల్లో కన్నా ఇలా ఫోటో షూట్స్ తోనే తన అందాలన్నిటిని ప్రదర్శిస్తుంది. టూ పీస్ బికిని షో.. ఇన్నర్ వేర్ షోలతో ఎప్పుడూ బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా ఉంటుంది దిశా పటాని.

టైగర్ ష్రాఫ్ తో ఇన్నాళ్లు డేటింగ్ చేసిన దిశా ఇప్పుడు ఎవరి దారి వారు చూసుకోవడంతో ఒంటరిగా ఉందేమో అందుకే ఆడియన్స్ ని ఆకట్టుకునేందుకు వయ్యారాల వల వేస్తుంది. ఈమధ్య తన లుక్ విషయంలో జాగ్రత్తలు తీసుకున్న దిశా పటాని ఫేస్ కి ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయించుకుందని వార్తలు వచ్చాయి. ఫైనల్ గా మళ్లీ అమ్మడు తన హాట్ లుక్స్ తో ఇంప్రెస్ చేస్తుంది.    

దిశా పటాని సినిమాల విషయానికి వస్తే ఎన్నో ఆశలు పెట్టుకున్న ఏక్ విలన్ 2 నిరాశపరచింది. ప్రస్తుతం యోద సినిమాలో నటిస్తుంది. తెలుగులో పూరీ జగన్నాథ్ డైరక్షన్ లో వరుణ్ తేజ్ సరసన లోఫర్ సినిమాలో నటించిన దిశా ఆ సినిమా ఫ్లాప్ అవడంతో ఇక్కడ ఆఫర్లు అందుకోలేదు. ప్రభాస్ ప్రాజెక్ట్ కె లో దిశా పటాని ఛాన్స్ కొట్టేసినట్టు తెలుస్తుంది.

ప్రాజెక్ట్ K హిట్టు పడితే మాత్రం దిశాకి మళ్లీ తెలుగులో వరుస అవకాశాలు వస్తాయని చెప్పొచ్చు. మళ్లీ కాల్విన్ క్లైన్ తో రెచ్చిపోతున్న దిశా తన హాట్ స్టిల్స్ తో సోషల్ మీడియాని షేక్ చేస్తుందని చెప్పొచ్చు. అమ్మడి ఫోటోలు చూస్తున్న నెటిజెన్లు బోల్డ్ నెస్ కి బ్రాండ్ అంబాసిడర్ అని.. ఇలా చేస్తే ఎలా అమ్మడు అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.  

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News