అంత చూపిస్తే తప్పేమో దిశా

Update: 2017-06-01 15:22 GMT
దిశా పటానీ అందాల మోత ఎలా ఉంటుందో తెలియాలంటే ఆమె ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ చూడాలి. 55 లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నారంటే విపరీతమైన క్రేజ్ ఉన్న హీరోయిన్ అనేసుకోవచ్చు. కానీ పట్టుమని రెండే సినిమాలు చేసిన దిశాకు ఈ స్థాయి ఫాలోయర్స్ ఉన్నారంటే.. అమ్మడు చూపించే అందాల ఫోటోలు.. డ్యాన్సింగ్ వీడియోల మహిమే.

అయితే.. అందాలు చూపించడం వరకూ ఓకే కానీ.. ఈ భామ అప్పుడే తలబిరుసు కూడా చూపించేస్తోందట. ఇంతలేసి ఎక్స్ పోజింగ్ చేసి ఫోటో షూట్స్ చేయడం అంతా సినిమా అవకాశాల కోసమే. అయితే ఆ ఛాన్సులు వచ్చినపుడు మాత్రం తల పొగరు చూపిస్తోందని అంటున్నారు. భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడం.. రణబీర్ కపూర్.. రణవీర్ సింగ్ లాంటి స్టార్ హీరోలతో.. అది కూడా మెయిన్ హీరోయిన్ పాత్ర అయితేనే చేస్తానని చెప్పడంతో.. ఆఫర్ ఇచ్చిన వారు షాక్ తినేస్తున్నారు. ఇప్పుడిప్పుడే జాగ్రత్తగా కెరీర్ లో అడుగులు వేయాల్సిన టైంలో.. ఇంతేసి గొంతెమ్మ కోర్కెలు కోరడం వారి మైండ్ బ్లాంక్ చేసేస్తోంది.

రీసెంట్ గా ప్రభాస్ సరసన సాహో మూవీలో యాక్ట్ చేయమని ఈ భామకు ఆఫర్ చేస్తే.. ఏకంగా 5 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అడిగి బెదరగొట్టేసింది. ఇప్పటికే ఈమెతో ఒప్పందం చేసుకున్న ట్యాలెంట్ మేనేజ్మెంట్ కంపెనీకి కూడా.. దిశా వైఖరిపై తలబొప్పి కట్టేసిందని చెబుతున్నారు. ఆమెతో అగ్రిమెంట్ తెగతెంపులు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని బాలీవుడ్ టాక్. ఇంకా కెరీర్ సరిగా మొదలవక ముందే ఇంత తల బిరుసు చూపించడం కుదరదనే విషయాన్ని దిశా పటానీ ఎప్పటికి తెలుసుకుంటుందో! తీరా తెలుసుకునే నాటికి కెరీర్ ఉంటుందో ఉండదో!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News