లోఫర్ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైనా బ్యూటీ దిశా పటాని. పొట్టి దుస్తుల్లో నిత్యం కనిపించే ఈ బ్యూటీ ఎక్కువగా ఫొటో షూట్స్ తో ఫెమస్ అయ్యిందనే చెప్పాలి. గతంలో సినిమాలు పెద్దగా కలిసి రాలేదు కాని పర్ఫెక్ట్ మోడల్ అవ్వడంతో కొన్ని కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా క్లిక్ అయ్యింది. ఇక భాగీ 2 సినిమా సక్సెస్ అవ్వడంతో దిశా దశ తిరిగింది. ఏకంగా సల్మాన్ ఖాన్ తో నటించే అవకాశం అందిపుచ్చుకుంది.
మొన్నటి వరకు అందం కోసం యోగాలు జిమ్ లో వర్కౌట్స్ చేసిన ఈ బేబీ ఇప్పుడు సినిమా కోసం కొత్త తరహా వర్కౌట్స్ చేస్తోంది. సల్మాన్ ఖాన్ నెక్స్ట్ భరత్ అనే సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమాలో దిశా క్యారెక్టర్ చాలా కొత్తగా ఉండనుందట. ట్రిపీజ్ ఆర్టిస్ట్ పాత్ర అని చెప్పడంతో క్యారెక్టర్ లో ఒరిజినాలిటీ కనిపించాలని సర్కస్ లో వివిధ రకాలా విన్యాసాలల్లో శిక్షణ తీసుకుంటోంది. ముంబై లోని ఒక ప్రముఖ సర్కస్ శిక్షణాకారులతో అమ్మడు ఫ్రెండ్లిగా ఉంటూ వారి నుంచి ట్రిక్స్ నేర్చుకుంటోంది.
బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ భరత్ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. ఇంతకుకముందు సల్మాన్ ఖాన్ - అలీ అబ్బాస్ జాఫర్ కాంబినేషన్ లో వచ్చిన సుల్తాన్ - టైగర్ జిందా హై సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను అందుకున్నాయి. ఇక ఇప్పుడు భరత్ అనే సినిమాపై కూడా అంచనాలు భారీగా పెరిగాయి. మరి ఈ సినిమా తరువాత దిశా అదృష్టం ఎలా కొనసాగుతుందో చూడాలి.