నాగ్ వాళ్లకీ న్యాయం చేస్తాడా?

Update: 2017-02-18 04:41 GMT
ప్రయోగాలకు ఏనాడు వెరవని తత్వం.. కొత్తదనాన్ని ప్రోత్సహించే వ్యక్తిత్వం.. ఇలాంటి వాటన్నిటికీ మారు పేరు అక్కినేని నాగార్జున. మనం.. సోగ్గాడే చిన్ని నాయన.. ఊపిరి లాంటి విభిన్నమైన చిత్రాలలో నటించి మెప్పించేసిన ఈ స్టార్ హీరోపై ఇప్పుడు ఒత్తిడి పెరుగుతోంది.

ఊపిరి చిత్రానికి ఎంత మంచి పేరు వచ్చినా.. నిర్మాతకు నష్టాలు వచ్చాయన్నది కూడా నిజమే. దాన్ని భర్తీ చేసేందుకే పీవీపీకి రాజుగారిగది2 చేస్తున్నాడన్నది టాక్. అయితే.. ఈ మధ్య వరుసగా అక్కినేని ఫ్యామిలీ సినిమాలు నిరుత్సాహపరుస్తున్నాయి. నాగ్ పై ఉన్న నమ్మకంతో భారీ రేట్లకే ఓం నమో వెంకటేశాయను కొనుగోలు చేశారు డిస్ట్రిబ్యూటర్లు.. బయ్యర్లు. ఈ చిత్రం సేఫ్ జోన్ లోకి రావాలంటే 40 కోట్లు వసూలు చేయాల్సి ఉంటుంది. ఆ సినిమా కలెక్షన్స్ చూస్తే ఆ పరిస్థితి కనిపించడం లేదు. టాక్ బాగుండడంతో ఊపందుకుంటుందని అనుకున్నారు కానీ.. మొదటివారం పూర్తయ్యే సరికి తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్స్ 5.56 కోట్లు మాత్రమే.

దీనికి ముందు నాగ్ నిర్మించి స్పెషల్ రోల్ చేసిన నిర్మలా కాన్వెంట్ పై కూడా పెద్ద మొత్తాన్నే వెచ్చించారు డిస్ట్రిబ్యూటర్లు. ఈ చిత్రం పేలిపోయింది. దీనికి ముందు అఖిల్ లాంఛింగ్ మూవీ.. టాలీవుడ్ బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా నిలిచిన సంగతి తెలిసిందే. మరి నిర్మాత పీవీపీ కి నష్టాలను భర్తీ చేసేందుకు నాగార్జున రాజుగారి గది చేస్తున్నపుడు.. డిస్ట్రిబ్యూటర్లకు కూడా ఏదో ఒకటి చేయాలి కదా అనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కలిసి.. నాగార్జునను కలిసి న్యాయం చేయమని అడగాలని అడగబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. అసలే ఓం నమో వెంకటేశాయ ఫలితంపై నిరుత్సాహపడ్డ నాగ్.. ఇప్పుడు ఏం చేస్తాడా అనే ఆసక్తి నెలకొంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News