తమిళనాడుకు చెందిన బుల్లితెర నటి దివ్య శ్రీధర్ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. తన భర్త తనను మోసం చేశారంటూ ఆమె పోలీసుల్ని ఆశ్రయించారు. తన భర్త మరో నటితో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లుగా పేర్కొన్నారు.
ప్రస్తుతం తాను ప్రెగ్నెంట్ అని చెప్పిన ఆమె మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఒక ప్రముఖ చానల్ ప్రసారం చేసే తమిళ సీరియల్ తో దివ్య శ్రీధర్ ఫేమస్ అయ్యారు.
పేరు ప్రఖ్యాతుల్ని సొంతం చేసుకున్న తర్వాత తాను నటించే సీరియల్ లో సహ నటుడైన ఆర్నవ్ తో ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత వారిద్దరూ లివింగ్ రిలేషన్ లో ఉన్నారు. తర్వాత రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. అయితే.. తమ పెళ్లిని అధికారికంగా అప్పుడే ఎవరికి చెప్పొద్దని కోరినట్లుగా పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్ లో పేర్కొన్నారు.
తనతో కొన్నాళ్లు బాగానే ఉన్న ఆర్నావ్.. తాజాగా మరో సినీ నటితో ప్రేమలో ఉన్నారని చెప్పింది. దీంతో తాను తన భర్తను నిలదీశానని.. అందరి సమక్షంలో పెళ్లి చేసుకోవాలని తాను పట్టుబట్టటంతో కాంచీపురంలోని ఒక టెంపుల్ లో తామిద్దరం మరోసారి పెళ్లి చేసుకున్నట్లు చెప్పింది. ఇదిలా ఉంటే.. ఆర్నావ్ ఇప్పుడు మరో నటితో సంబంధం పెట్టుకొని.. తనను అడ్డు తొలగించుకోవాలని చూస్తున్నట్లు చెప్పింది.
ఇప్పుడు ఆర్నావ్ వల్ల తనకు.. తనకు పుట్టబోయే బిడ్డకు ప్రాణహాని ఉందన్నారు. తనను అబార్షన్ చేయించుకోవాలని ఆర్నావ్ కోరాడని.. బలవంతంగా అయినా అబార్షన్ చేయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించింది.
ప్రస్తుతం తాను అనారోగ్య సమస్యలతో చెన్నైలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేరానని చెప్పిన ఆమె.. తనకు న్యాయం చేయాలని పోలీసుల్ని కోరుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.