డిజె ఆడియోలో పద్దతులు మారాయ్

Update: 2017-06-12 04:23 GMT
అసలు మెగా హీరోల ఆడియో వేదికలు అంటే.. అక్కడ ఖచ్చితంగా ''పవర్ స్టార్ పవర్ స్టార్'' అంటూ పవన్ కళ్యాణ్‌ అభిమానులు అరుస్తూనే ఉంటారు. దీని గురించే ఎన్నోసార్లు ఇబ్బందిపడిన అల్లు అర్జున్.. ఒకానొకసారి ''చెప్పను బ్రదర్'' అనేశాడు. అదే పెద్ద ఇష్యూ అయ్యింది. ఆ తరువాత పవన్ అభిమానులు తమ కోపాన్ని చాలా విధాలుగా వ్యక్తపరిచారు. అందుకే ఇప్పుడు డిజె ఆడియో లాంచ్ కార్యక్రమంలో ఏం జరుగుతుందా అనే క్యురియాసిటీ అన్ని చోట్లా నెలకొని ఉంది. అయితే అక్కడ సీన్ పూర్తిగా మారిపోయింది. కొత్తగా కొన్ని కొన్ని వినిపించాయ్.

పైన ఉన్న ఒక గ్యాలరీలో పవన్ కళ్యాణ్‌ అభిమానులు ఉన్నారని అర్ధమైపోయింది. హరీశ్‌ శంకర్ గబ్బర్ సింగ్ గురించి చెప్పినప్పుడో.. పవన్ కళ్యాణ్‌ ను సింపుల్ గయ్ అన్నప్పుడో.. లేదంటే ఇంకెవరైనా పవర్ స్టార్ ప్రస్తావన తెచ్చినా కూడా అక్కడ నుండి వీలలు అరుపులూ వినిపించాయి. అయితే అస్తమానం వీరి అరుపులూ కేకలకంటే కూడా.. కింద నుండి ఇంకొక సౌండ్ తెగ డామినేట్ చేసింది. చాలామంది అభిమానులు ''డి..జె..'' అంటూ ఆ సౌండుతో ఆడిటోరియంను హోరెత్తించారు. వీరందరూ కూడా హరీశ్‌ శంకర్ మాట్లాడినా.. అల్లు అరవింద్ మాట్లాడినా.. డిజె అంటూ అరుస్తూనే ఉన్నారు. బన్నీ ఫంక్షన్లో డిజె అంటూ గోల చేయడం ఏంటో ఎవ్వరికీ అర్ధం కాలేదు.

చివరకు అల్లు అర్జున్ కూడా తన సినిమా డైలాగునే వాడుకుంటే.. ''ఇలా డిజె డిజె అని అరుస్తూ.. సభ్యసమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని??'' అంటూ జోకేశాడు. అప్పుడు కాని డిజె అంటూ అరుస్తున్న ఆ అభిమానులు సైలెంట్ అవ్వలేదు. మొత్తానికి డిజె దువ్వాడ జగన్నాథమ్ ఆడియో లాంచ్ ఈవెంట్లో ఆ విధంగా ఫ్యాన్స్ అరిచే విషయంలో పద్దతులు మారాయ్ అని చెప్పొచ్చు.

ఇక అల్లు అర్జున్ మరో మాట చెప్పాడండోయ్. ఇప్పటివరకు మెగా ఫ్యాన్స్ అని తాను అంటుంటే.. అందులో మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యాన్స్ తో కలిపి.. పవర్ స్టార్ ఫ్యాన్స్.. రామ్ చరణ్‌ ఫ్యాన్స్.. తేజు.. వరుణ్‌.. శిరీష్‌.. నీహా (నిహారిక) ఫ్యాన్స్ కూడా ఉన్నారట. అందరికీ కలిపి పెట్టుకున్న పేరే మెగా ఫ్యాన్స్ అంటూ బన్నీ సెలవిచ్చాడు. అది సంగతి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News