సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సిద్దూ జొన్నలగడ్డ - నేహా శెట్టి జంటగా తెరకెక్కిన చిత్రం ''డీజే టిల్లు''. 'అట్లుందటి మనతోని' అంటూ వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. యూఏస్ఏ లోనూ మంచి వసూళ్ళు అందుకుంది. థియేటర్లలో ఘనవిజయం సాధించిన ఈ యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్.. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.
తెలుగు డిజిటల్ ప్లాట్ ఫార్మ్ 'ఆహా' వేదికగా ''డీజే టిల్లు'' సినిమా శుక్రవారం (మార్చి 4) నుంచి డిజిటల్ ప్రీమియర్ గా ప్రదర్శించబడుతోంది. థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ చిత్రం ఓటీటీలోనూ అదరగొడుతోంది. ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన తెచ్చుకుని మంచి వ్యూయర్ షిప్ రాబడుతోందని తెలుస్తోంది.
'డీజే టిల్లు' మూవీ స్ట్రీమింగ్ ప్రారంభమైన వెంటనే పెద్ద ఎత్తున వీక్షకులు లాగిన్ అవ్వడంతో కొద్దిసేపు ఆహా ఓటీటీ సర్వర్ కు కూడా సమస్య వచ్చిందంటేనే రెస్పాన్స్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రిలీజ్ కు ముందే ప్రచార కార్యక్రమాలతో నెట్టింట సందడి చేసిన ఈ చిత్రం.. యూత్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయింది.
లవ్ అండ్ ఫన్ అంశాలతో హిలేరియస్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో ప్రధాన నటీనటుల పెరఫార్మెన్స్ మరియు సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అందుకే థియేటర్లలో అత్యధిక వసూళ్ళు సాధించిన ఈ సినిమా.. ఇప్పుడు డిజిటల్ వేదిక మీద డీజే వాయిస్తోంది. ఆహా ఓటీటీకి మరింతగా ట్రాఫిక్ పెరగడమే కాదు.. రికార్డ్ స్థాయి వ్యూయింగ్ మినిట్స్ అందుకుంటోంది.
కాగా, ''డీజే టిల్లు'' చిత్రానికి కథ - స్క్రీన్ ప్లే - డైలాగ్స్ హీరో సిద్ధు జొన్నలగడ్డ అందించడం విశేషం. శ్రీచరణ్ పాకాల - రామ్ మిరియాల ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేశారు. ప్రిన్స్ సిసిల్ - బ్రహ్మాజీ - ప్రగతి - నర్రా శ్రీనివాస్ - కిరీటి ఈ సినిమాలో ఇతర పాత్రలు పోషించారు.
పీడీవీ ప్రసాద్ సమర్పణలో ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ సహకారంతో యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ''డీజే టిల్లు'' చిత్రాన్ని నిర్మించారు. సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు సినిమాటోగ్రఫీ అందించగా.. అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించారు. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేశారు.