యూత్‌ ను టార్గెట్‌ చేస్తున్న డీజే టిల్లు

Update: 2022-01-31 13:30 GMT
ఈమద్య కాలంలో టాలీవుడ్‌ లో ఎక్కువగా వినిపిస్తున్న నిర్మాణ సంస్థల పేర్లలో సితార ఎంటర్టైన్మెంట్స్ ఒకటి అనడంలో సందేహం లేదు. రాధాకృష్ణ ఆధ్వర్యంలో నాగవంశీ ఈ బ్యానర్ ను లీడ్ చేస్తున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల టాక్‌. ఆ విషయం పక్కన పెడితే చిన్నా పెద్ద అనే తేడా లేకుండా సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో మంచి సినిమాలు చాలా వస్తున్నాయి. ఒక వైపు భీమ్లా నాయక్ వంటి అతి పెద్ద సినిమా ను పవన్ కళ్యాణ్ తో నిర్మించిన నాగ వంశీ మరో వైపు సిద్దు జొన్నలగడ్డ తో డీజే టిల్లు వంటి సినిమాను కూడా నిర్మించాడు. మంచి సబ్జెక్ట్ లను ఎంపిక చేస్తూ సినిమాలు చేస్తున్న నిర్మాత వంశీ మరోసారి డీజే టిల్లుతో ప్రేక్షకులను ఎంటర్‌ టైన్ చేసేందుకు సిద్దం అయ్యాడు. డీజే టిల్లు సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని భావించిన హడావుడి రిలీజ్ ఎందుకు అనుకుని మెల్లగా విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో ఫిబ్రవరి లో విడుదలకు సిద్దం చేశారు.

డీజే టిల్లు నుండి ఇప్పటికే విడుదల అయిన పోస్టర్స్ మరియు గ్లిమ్స్ సినిమా పూర్తిగా యూత్‌ కు కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుందని అనిపిస్తున్నాయి. డీజే టిల్లు సినిమా కు థమన్‌ అందించిన సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. డీజే టిల్లు టైటిల్‌ సాంగ్‌ ప్రస్తుతం మారు మ్రోగుతోంది. ఎక్కడ చూసిన డీజే.. డీజే అన్నట్లుగా పాట హడావుడి చేస్తుంది. ఇక తాజాగా విడుదల అయిన ఒక స్టిల్‌ కూడా సినిమా పై యూత్‌ లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంది అనడంలో సందేహం లేదు. హీరో మరియు హీరోయిన్ అలా ప్లోర్ పై పడుకుని రొమాంటిక్‌ ముద్దు పెట్టుకుంటూ ఉండటం చూస్తుంటే ఇది మరో అర్జున్‌ రెడ్డి రేంజ్‌ యూత్‌ ఫుల్‌ రొమాంటిక్ ఎంటర్‌ టైనర్ అనిపిస్తుంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

డీజే టిల్లు సినిమా ను ఫిబ్రవరి 11న విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే ప్రకటించారు. ఇక ట్రైలర్‌ ను ఫిబ్రవరి 2వ తారీరకున విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. ఈ సినిమా లో సిద్దుకు జోడీగా నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది. వీరిద్దరి కాంబోలో వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు సినిమాపై అంచనాలు మరియు ఆసక్తిని పెంచేస్తున్నాయి. తప్పకుండా ఈ సినిమా సితార ఎంటర్‌ టైన్మెంట్స్ బ్యానర్‌ లో మరో మంచి సినిమా గా నిలుస్తుందని కూడా ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. ప్రస్తుతం డీజే టిల్లు కు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు మెల్ల మెల్లగా జోరందుకుంటున్నాయి.
Tags:    

Similar News