సిద్దు.. నేహా శెట్టి జంటగా తెరకెక్కిన డీజే టిల్లు సినిమా వసూళ్ల విషయంలో ట్రేడ్ వర్గాల వారిని కూడా ఆశ్చర్యపర్చుతూ దూసుకు పోతుంది. డీజే టిల్లు సినిమా భారీ స్థాయిలో వసూళ్ల ను దక్కించుకుంటూ దూసుకు పోతుంది. ఈ సినిమా ముఖ్యంగా యూఎస్ లో ఈ ఏడాదిలో విడుదలైన తెలుగు సినిమాలన్నింటిలోకి భారీ బ్లాక్ బస్టర్ మూవీగా అత్యధిక వసూళ్లు దక్కించుకున్న చిత్రంగా నిలిచింది.
బంగార్రాజు సినిమాను మించి వసూళ్లు దక్కించుకుంటుంది. యూఎస్ లో ఈ సినిమాను రాధాకృష్ణ ఎంటర్‌టైన్‌మెంట్స్ వారు విడుదల చేశారు. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ సాధించిన డీజే టిల్లు సినిమా అరుదైన రికార్డ్ వైపుగా దూసుకు పోతుంది. హాఫ్ మిలియన్ డాలర్ల వసూళ్లను ఈ వీకెండ్ కు డీజే టిల్లు యూఎస్ లో నమోదు చేయడం ఖాయం అంటూ ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటి వరకు నాలుగు లక్షల డాలర్ల ను రాబట్టిన డీజే టిల్లు ముందు ముందు మరింత భారీ వసూళ్లను దక్కించుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది. ఎందుకంటే ఈ సినిమాకు పోటీ ఈ వారం కూడా లేదు. వచ్చే వారంలో విడుదల కాబోతున్న భీమ్లా నాయక్ తోనే డీజే టిల్లు జోరుకు బ్రేక్ పడుతుంది. అంటే అప్పటి వరకు ఈ సినిమా వసూళ్లతో కుమ్మేయడం ఖాయం. కేవలం యూఎస్ లోనే కాదు ఇక్కడ కూడా మంచి వసూళ్లు నమోదు అవుతున్నాయి.
వీక్ డేస్ లో ఈ సినిమా భారీగానే వసూళ్లను రాబడుతున్నట్లుగా ట్రేడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. చిన్న సినిమా అయినా కూడా.. ఏపీలో టికెట్ల రేట్లు తక్కువ ఉన్నా కూడా వీక్ డేస్ లో దాదాపుగా కోటి రూపాయల వరకు వసూళ్లు నమోదు అవుతున్నట్లుగా తెలుస్తోంది. వీక్ డేస్ లోనే ఈ స్థాయి వసూళ్లు నమోదు అయితే వీకెండ్స్ లో మళ్లీ ఓపెనింగ్ కలెక్షన్స్ ను రిపీట్ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
డీజే టిల్లు విడుదల అయిన రోజుకు ఒక్క రోజు ముందు రవితేజ నటించిన ఖిలాడి సినిమా విడుదల అయ్యింది. ఖిలాడి తో పోటీ పడి టిల్లు అన్న నిలుస్తాడా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కాని ఖిలాడి సినిమాకు నెగటివ్ రివ్యూలు రావడంతో వసూళ్లు రెండవ రోజే తగ్గాయి. దాంతో డీజే టిల్లు సినిమాకు కలిసి వచ్చింది.
ఈ రెండు సినిమాల వసూళ్లు పోటీ పడుతాయని భావించగా డీజే టిల్లు వసూళ్ల ముందు ఖిలాడి వసూళ్లు తేలిపోతున్నాయి అంటూ ట్రేడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.