రాకింగ్ స్టార్ యష్ నటించిన 'కేజీఎఫ్ 2' బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. ప్రశాంత్ నీల్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రంపై గత కొన్నేళ్లుగా భారీ అంచనాలు నెలకొని వున్న విషయం తెలిసిందే. చాప్టర్ 1 పాన్ ఇండియా లెవెల్లో మోన్ స్టార్ బ్లాక్ బస్టర్ కావడంతో సహజంగానే చాప్టర్ 2పై అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ , సినీ లవర్స్ దాదాపు నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్నారు. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన 'కేజీఎఫ్ 2' ఎట్టకేలకు ఎలాంటి పోటీ లేకుండా ఏప్రిల్ 14న భారీ స్థాయిలో విడుదలైంది.
తొలి రోజు ప్రారంభ వసూళ్ల పరంగా రికార్డులు సృష్టించిన ఈ మూవీ బాలీవుడ్ లో సరికొత్త చరిత్రని సృష్టించింది. ఇప్పటి వరకు పలు క్రేజీ చిత్రాల రికార్డుల్ని తుడిపెడుతున్న కేజీఎఫ్ 2 ఇప్పటికే వరల్డ్ వైడ్ గా 600 కోట్ల మార్కుని దాటి ప్రకంపణలు సృష్టిస్తోంది. రానున్న రోజుల్లో 1000 కోట్ల క్లబ్ లో అవలీలగా చేరిపోతుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
యాంగ్రీ యంగ్ మెన్ గా యష్ స్వాగ్ ఎంట్రీ.. సినిమాలో అతని పాత్రని తీర్చిదిద్దిన తీరు. హై లెవెల్ ఎలివేషన్స్ సినిమాని ఓ రేంజ్ లో ప్రేక్షకులు అక్కున చేర్చుకునేలా చేశాయి. మాస్ క్లాస్ అని తేడా లేకుండా ఓ ప్రాంతీయ సినిమాకు పాన్ ఇండియా వైడ్ గా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.
ఇప్పటికే పలు రికార్డుల్ని క్రాస్ చేసిన ఈ చిత్రం రానున్న రోజుల్లో మరిన్ని రికార్డుల్ని తిరగరాస్తుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన ఆ సక్తికరమైన వార్త ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. చాప్టర్ 2 లో అత్యంత కీలకంగా నిలిచిన పాత్రలు అధీరా, రమికా సేన్, రాఘవన్, ఇనాయత్ ఖలీల్. ఈ పాత్రల్లో ఎవరు నటించారన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అధీరాగా సంజయ్ దత్ కనిపించగా, రమికా సేన్ పాత్రలో రవీనా టాండన్ నటించారు.
అలాగే సీబీఐ డైరెక్టర్ రాఘవన్ పాత్రలో రావు రమేష్ కనిపించారు. అయితే కథని మలుపుతిప్పే ఇనాయత్ ఖలీల్ పాత్రలో ఎవరు నటించారన్నది ఇప్పడు ఆసక్తికరంగా మారింది. ఈ పాత్రలో తెలుగు నటుడు ఆదర్శ్ బాలకృష్ణ ఫాదర్ బాలకృష్ణ నీలకంఠాపురం నటించడం పలువురిని షాక్ కు గురిచేస్తోంది. ఆదర్శ్ బాలకృష్ణ హ్యాపీడేస్ చిత్రంతో నటుడిగా కెరీర్ ప్రారంభించారు. ఆ తరువాత చాలా చిత్రాల్లో నటించారు నటిస్తున్నారు కూడా. అయితే అలాంటి ఆదర్శ్ బాలకృష్ణ ఫాదర్ ఇప్పటి వరకు ఏ సినిమాలో నటించలేదు. ఆయన తొలిసారి 65 వయసులో ఇనాయత్ ఖలీల్ పాత్రలో నటించి ఆకట్టుకోవడం విశేషం.
ఈ విషయాన్ని నటుడు ఆదర్శ్ బాలకృష్ణ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. కేజీఎఫ్ 2 ప్రపంచంలో మా నాన్న 'ఇనాయత్ ఖలీల్' గా ఓ భాగమైనందుకు చాలా గర్వంగా వుంది. 65 ఏళ్ల యంగ్ ఏజ్ లో కెరీర్ ని ప్రారంభించారు. ఈ క్రెటిట్ అంతా దర్శకుడు ప్రశాంత్ నీల్‌దే' అని ట్వీట్ చేశారు. ఆదర్శ్ బాలకృష్ణ చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.