తమ అభిమాన తారలు ధరించే దుస్తులు వాచ్ లు షూస్ వగైరా వగైరా అభిమానుల్లో ఎంతో క్యూరియాసిటీకి కారణమవుతుంటాయి. ఏ బ్రాండ్ దుస్తులు ధరిస్తున్నారు. ఆ వాచ్ ఏ కంపెనీది? షూస్ ఏ స్పోర్ట్ బ్రాండ్? అంటూ ఆరాలు తీసే అభిమానులుంటారు.
ఇటీవల రామ్ చరణ్ చేతి గడియారంపైనా అభిమానులు అదే విధంగా శోధిస్తూ అంతర్జాలంలో ఆ ఫోటోని వైరల్ చేస్తున్నారు. చరణ్ ఈ ఫోటోలో ధరించిన రిస్ట్ వాచ్ అల్ట్రా రిచ్ లుక్ తో కనిపిస్తోంది. ఇది కచ్ఛితంగా విదేశీ బ్రాండ్. దీని ఖరీదు ఏకంగా 1.50 లక్షల డాలర్లు అంటూ లెక్కలు తీస్తున్నారు. అంటే భారతీయ కరెన్సీలో సుమారు 1కోటి 50 లక్షలు దీని వెల. అంత ఖరీదైన వాచ్ ని చరణ్ ధరిస్తున్నారు.
దీంతో ఒక పేదవాడు జీవితాంతం కూచుని ఆనందంగా తిని బతికేయొచ్చు అంటూ కామెంట్లను ఈ ఫోటోకి జోడిస్తూ వైరల్ చేస్తున్నారు. ఈ వాచ్ బడ్జెట్ తో పేదలను బాగు చేయొచ్చని కొందరు అభిప్రాయపడితే కొందరు అభిమానుల అభిప్రాయం వేరొకలా ఉంది. అంత పెద్ద స్టార్ ఆ రేంజ్ వాచ్ ధరించకపోతే సెలబ్రిటీ ప్రపంచంలో కుదరదని.. తన ప్రత్యేకత ఏం ఉంటుందని కూడా వాదిస్తున్నారు. ఇక కెరీర్ పరంగా చూస్తే ఆచార్య చిత్రీకరణ పూర్తి చేసిన చరణ్ ఆర్.ఆర్.ఆర్ పెండింగ్ చిత్రీకరణను వేగంగా ముగించి.. తదుపరి శంకర్ దర్శకత్వంలో నటించాల్సి ఉంటుంది.