తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోహన్ బాబుది ప్రత్యేకమైన శైలి. ఆయన కెరీర్ గ్రాఫ్ కూడా వైవిద్యంగా సాగింది. కలెక్షన్ కింగ్ గా తెలుగు ప్రేక్షకుల నుంచి నీరాజనాలు అందుకున్న ఆయన.. ఎన్నో ఎత్తు పల్లాలను చవిచూశారు. అయితే.. మోహన్ బాబును స్టార్ గా మార్చిన దర్శకుడు ఎవరో మీకు తెలుసా?
చిత్రపరిశ్రమలో అసిస్టెంట్ డైరెక్టర్ గా అడుగు పెట్టారు భక్తవత్సలం నాయుడు. నటుడిగా మారిన తర్వాత మోహన్ బాబుగా మారిపోయారు. హీరోగా చేసిన తర్వాత కూడా సరైన అవకాశాలు రాకపోవడంతో.. మళ్లీ విలన్ గా, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా దూసుకెళ్లారు. ఆ తర్వాత తిరిగి హీరో అయ్యారు.
సెకండ్ ఇన్నింగ్స్ లోనే ఆయన్ను టాప్ స్టార్ గా మార్చారు దర్శకుడు బి.గోపాల్. మాస్ చిత్రాల దర్శకుడిగా తనదైన ముద్రవేసుకున్న గోపాల్.. మొదటి సారిగా మోహన్ బాబుతో 'అసెంబ్లీ రౌడీ' అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాతో మోహన్ బాబు టాప్ స్టార్ గా మారిపోయారు. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ మూవీతోనే మోహన్ ''బాబు కలెక్షన్ కింగ్''గా మారిపోయారు. తమిళ్ మూవీ ''వేలై కిడాయిచుడుచు'' చిత్రానికి ఇది రీమేక్. ఈ మూవీ తర్వాత మోహన్ బాబు స్టార్ హీరోగా వెనుదిరిగి చూసుకోలేదు.
వీరిద్దరి కాంబోలో మొత్తం నాలుగు చిత్రాలు తెరకెక్కాయి. రెండో చిత్రం 'బ్రహ్మ' యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ చిత్రం కూడా మంచి విజయం సాధించింది. ఈ మూవీలో శిల్ప శిరోద్కర్, ఐశ్వర్య హీరోయిన్లుగా నటించారు.
ఆ తర్వాత మోహన్ బాబు - బి.గోపాల్ కాంబినేషన్లో వచ్చిన మూడో చిత్రం 'కలెక్టర్ గారు'. సాక్షిశివానంద్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఆ తర్వాత వచ్చిన నాలుగో మూవీ ''అడవిలో అన్న''. నక్సలైట్ గా మోహన్ బాబు అద్భుతంగా నటించిన ఈ చిత్రం.. బాక్సీఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ విధంగా.. వీరి కాంబోలో వచ్చిన నాలుగు చిత్రాలూ హిట్ జాబితాలో నిలిచాయి.
ఇప్పుడు చూస్తే.. బి.గోపాల్ మెగాఫోన్ పక్కన పెట్టి చాలా ఏళ్లు అవుతుండగా.. మోహన్ బాబు కూడా చాలా కాలం గ్యాప్ తర్వాత ''సన్నాఫ్ ఇండియా'' అనే సినిమా చేస్తున్నారు.