'కేజీఎఫ్‌ 2' కోసం సలార్ ఏం చేయబోతున్నాడో తెలుసా..!

Update: 2022-03-23 15:30 GMT
గత రెండున్నర మూడు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న కేజీఎఫ్ 2 ఎట్టకేలకు వచ్చే నెల విడుదలకు సిద్దం అయ్యింది. ఏప్రిల్‌ 14వ తారీకున విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు మెల్లగా షురూ అవుతున్నాయి. తాజాగా తుఫాన్‌ అంటూ సినిమా నుండి పాటను విడుదల చేయడం జరిగింది. పాటకు మంచి రెస్పాన్స్ రావడంతో పాటు సినిమా పై మరింతగా అంచనాలు పెంచే విధంగా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి.

కేజీఎఫ్ సూపర్‌ హిట్‌ సాధించి భారీ వసూళ్లను దక్కించుకున్న కారణంగా కేజీఎఫ్ 2 ను అంతకు మించి జనాల్లోకి తీసుకు వెళ్లడం కోసం భారీ గా ప్రమోషన్‌ కార్యక్రమాలు చేయాలని భావిస్తున్నారు. అందుకోసం సౌత్‌ రాష్ట్రాలతో పాటు ఉత్తర భారతంలో కూడా ప్రస్తుతం ఆర్‌ ఆర్‌ ఆర్‌ కి ఎలా అయితే ప్రమోషన్స్ చేస్తున్నారో.. ఆ స్థాయిలోనే కేజీఎఫ్ 2 కి ప్రమోషన్‌ ను నిర్వహించబోతున్నట్లుగా తెలుస్తోంది.

కన్నడ సినీ వర్గాల వారు మరియు మీడియా సర్కిల్స్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఒక భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించేందుకు గాను దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ మరియు నిర్మాణ సంస్థ ప్రయత్నాలు చేస్తోంది. అది బెంగళూరు లేదా ముంబయిలో ఉండే అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్‌ ను కూడా పరిశీలిస్తున్నారు అనేది టాక్ వినిపిస్తుంది. వెన్యూ ఎక్కడైనా ఇప్పటికే స్పెషల్‌ గెస్ట్‌ ఫిక్స్ అయ్యాడు అనే వార్తలు వస్తున్నాయి.

కేజీఎఫ్‌ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ప్రభాస్‌ ముఖ్య అతిథిగా హాజరు అవ్వడం కన్ఫర్మ్‌ అయ్యింది. కేజీఎఫ్‌ చిత్ర దర్శకుడు ప్రశాంత్‌ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ ప్రస్తుతం సలార్ సినిమాను చేస్తున్నాడు. కేజీఎఫ్ సినిమా నిర్మాణ సంస్థ లోనే సలార్‌ సినిమా రూపొందుతుంది. కనుక కేజీఎఫ్ 2 కోసం ప్రభాస్ వస్తాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం హాలీడే లో ఉన్న ప్రభాస్ వచ్చే నెల మొదటి వారంలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్‌ లో పాల్గొంటాడని అంటున్నారు.

త్వరలోనే కేజీఎఫ్ 2 టీమ్ నుండి ఆ విషయమై అధికారికంగా ఒక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న సినిమాకు సంబంధించిన విడుదల తేదీలను పలు సందర్బాల్లో మార్చారు.

కరోనా వల్ల గత ఏడాది లేదా అంతకు ముందే రావాల్సిన కేజీఎఫ్ 2 ను ఇప్పుడు విడుదల చేయబోతున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉంటుంది.. పాన్ ఇండియా సూపర్‌ స్టార్‌ ప్రభాస్‌ ప్రజెన్స్ తో కేజీఎఫ్‌ 2 సినిమా బజ్‌ ఎంతగా పెరుగుతుంది అనేది చూడాలి.
Tags:    

Similar News