యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ `విక్రమ్`. దర్శకుడు లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఈ మూవీని రూపొందించాడు. కమల్ హాసన్ దాదాపు నాలుగేళ్ల విరామం తరువాత చేసిన `విక్రమ్` బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సాధించి కాసుల వర్షం కురిపించింది. అంత వరకు అప్పుల్లో వున్న కమల్ ని ఆ అప్పుల నుంచి బయటపడేసింది. కమల్ హాసన్ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో ఈ మూవీని నిర్మించారు.
ప్రపంచ వ్యాప్తంగా తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఈ మూవీ రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టి ట్రేడ్ వర్గాలని విస్మయానికి గురిచేసింది. తెలుగులో ఈ మూవీని నితిన్ ఫాదర్ ఎన్. సుధాకర్ రెడ్డి శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై విడుదల చేసి భారీ లాభాల్ని సొంతం చేసుకోవడం విశేషం. కమల్ తో పాటు ఈ మూవీలో విజయ్ సేతుపతి, మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్, మలయాళ నటుడు జయరామ్ తనయుడు కాళిదాస్ జయరామన్ కీలక పాత్రల్లో నటించారు.
డ్రగ్స్ మాఫియా కింగ్ పిన్ రోలెక్స్ పాత్రలో హీరో టెర్రిఫిక్ ఎంట్రీ ఇచ్చి సర్ ప్రైజ్ చేసిన విషయం తెలిసిందే. సినిమాలోని ఓ సన్నివేశంలో కార్తి నటించిన `ఖైదీ` సినిమా సీన్ ని చూపించడం, అందులో కార్తీ ఫేస్ కనిపించకుండా జాగ్రత్తలు తీసుకోవడం తెలిసిందే. కార్తి పక్కన పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన నరేన్ ని చూపించిన లోకేష్ కనగరాజ్ .. ఢిల్లీ పాత్రలో నటించిన కార్తిని ఎందుకు చూపించలేదని అంతా అనుకున్నారు.
అయితే తనని చూపించకపోవడానికి బలమైన కారణం వుందని తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు కార్తి. విక్రమ్ మూవీ గురించి మాట్లాడుతూ ..చివరి నిమిషం వరకు నేను చిన్న అతిథి పాత్రలో అయినా కనిపిస్తానని దర్శకుడు లోకేష్ కనగరాజ్ కు చెప్పానని, అయితే ఆ సమయంలో నేను పొన్నియిన్ సెల్వన్ 1 కోసం లాంగ్ హెయిర్, గడ్డంతో వున్నానని, ఆ కారణంగానే నేను `విక్రమ్`లో కనిపించలేకపోయానని తెలిపాడు కార్తి.
దీంతో కార్తి ఫ్యాన్స్ లాంగ్ హెయిర్ ఎంత పని చేసిందబ్బా అంటూ నిట్టూరుస్తున్నారు. కార్తి, సూర్య కలిసి నటించిన తొలి సినిమా విక్రమ్. అలాంటి మూవీలో కార్తి కనిపించి వుంటే బాగుండేదని, అలాంటి అరుదైన క్షణం మిస్సయిందని వాపోతున్నారట.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.