గత ఏడాది నుండి కరోనా కారణంగా సినిమాలు విడుదల అవ్వడమే గగనం అయ్యింది. సౌత్ లో అడపాదడపా సినిమాలు విడుదల అయినా బాలీవుడ్ లో మాత్రం సినిమాలే కనిపించలేదు. సౌత్ లో విడుదల అయిన సినిమాలు కొన్ని బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను దక్కించుకున్నాయి. కరోనా మొదటి వేవ్ తర్వాత భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సినిమా గా ఉప్పన నిలిస్తే.. సెకండ్ వేవ్ తర్వాత అత్యధిక వసూళ్లు దక్కించుకున్న సినిమా గా తమిళ మూవీ డాక్టర్ నిలిచింది. శివ కార్తికేయన్ హీరోగా నెల్సన్ దిలిప్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా భారీ వసూళ్లను దక్కించుకుని సెకండ్ వేవ్ తర్వాత ఇండియన్ సినిమా ల్లో అత్యధిక వసూళ్లు దక్కించుకున్న సినిమా గా నిలిచింది.
డాక్టర్ సినిమా ను తెలుగు లో కూడా ప్రేక్షకులు ఆధరించారు. మంచి టాక్ దక్కించుకున్న డాక్టర్ ను చాలా మంది ఇప్పటికే థియేటర్లలో చూసినా కూడా ఇంకా చాలా మంది ఓటీటీ స్ట్రీమింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఈ సినిమా స్ట్రీమింగ్ అప్డేట్ వచ్చింది. సినిమాను స్ట్రీమింగ్ చేయడం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో తమిళ మీడియాలో నవంబర్ 5న ఈ సినిమాను స్ట్రీమింగ్ కు సిద్దం చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. థియేటర్ రిలీజ్ అయిన నాలుగు వారాల తర్వాత ఈ సినిమాను స్ట్రీమింగ్ చేసేందుకు నెట్ ఫ్లిక్స్ వారు రైట్స్ ను కొనుగోలు చేయడం జరిగింది.
అక్టోబర్ 9వ తారీకున సినిమాను థియేటర్ల ద్వారా విడుదల చేయడం జరిగింది. నాలుగు వారాల తర్వాత సినిమా ను స్ట్రీమింగ్ చేసేలా ఓటీటీ రైట్స్ ను దక్కించుకున్న నెట్ ఫ్లిక్స్ వారు నవంబర్ 5న నాలుగు వారాలు పూర్తి అవుతున్న నేపథ్యంలో స్ట్రీమింగ్ కు సిద్దం చేస్తున్నారు. తమిళం మరియు తెలుగు లో మొదటగా స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా ను నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేయబోతున్న నేపథ్యంలో కొందరు ప్రేక్షకులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సౌత్ ఆడియన్స్ చాలా తక్కువ మంది నెట్ ఫ్లిక్స్ ఖాతాదారులుగా ఉన్నారు. ఈ సినిమాతో నెట్ ఫ్లిక్స్ సౌత్ ఖాతాదారుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు.