పుష్పరాజ్ మేకప్ కోసమే అన్ని గంటల సమయం పడుతోందా..?

Update: 2021-02-22 10:55 GMT
'అల వైకుంఠపురంలో' వంటి సూపర్ హిట్ తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా ''పుష్ప''. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది వీరి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ మరియు ఇద్దరికీ ఫస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడం విశేషం. ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో రూపొందే ఈ చిత్రంలో లారీ క్లీనర్ పుష్పరాజ్ పాత్రలో బన్నీ కనిపించనున్నాడు. ఈ పాత్రకు తగ్గట్లు తనను తాను మలచుకోడానికి అల్లు అర్జున్ తీవ్రంగా శ్రమిస్తున్నాడు.

'పుష్ప' కోసం బన్నీ మేకప్ వేసుకోవడానికి రోజుకు రెండు గంటలు సమయం పడితే.. దాన్ని తీయడానికి సుమారు గంటన్నర టైం పడుతున్నట్లు తెలుస్తోంది. నిజంగా ఒక లారీ క్లీనర్ గా కనిపించడానికి డైలీ మూడున్నర గంటల సమయం కేటాయిస్తున్నారన్నమాట. ఇందులో అల్లు అర్జున్ హెయిర్ - కనుబొమ్మలు - గడ్డం మీసాలతో సహా ప్రతి విషయం కూడా రోజువారీ కార్మికుడిని గుర్తు చేసే విధంగా ఉంటాయని తెలుస్తోంది. 'పుష్ప' తన ఫస్ట్ పాన్-ఇండియా ప్రాజెక్ట్ కావడంతో బన్నీ మరింత హార్డ్ వర్క్ చేస్తున్నట్లు అర్థం అవుతోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ విపరీతంగా ఆకట్టుకుంది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తమిళనాడులోని టెన్ కాశీలో జరుగుతోంది. అల్లు అర్జున్ జిమ్ వర్కౌట్స్ మరియు ఆహార నియమాలు చూసుకోవడానికి అతని పర్సనల్ ట్రైనర్ మరియు చెఫ్‌ కూడా టెన్ కాశీలోనే ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ మరియు ముత్యంశెట్టి మీడియా పతాకాలపై 'పుష్ప' సినిమా రూపొందుతోంది. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. దీనికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తుండగా.. మిరోస్లా కుబా బ్రోజెక్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నాడు. పాన్ ఇండియా లెవల్లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని ఆగస్టు 13న విడుదల చేయనున్నారు.
Tags:    

Similar News