'రాంచరణ్ 15'కు బ్రేక్ పడనుందా..??

Update: 2021-05-19 04:30 GMT
మెగాపవర్ స్టార్ రాంచరణ్ - సౌత్ ఇండియా అగ్రదర్శకుడు శంకర్ కాంబోలో తెరకెక్కనున్న పొలిటికల్ మూవీ పై రోజురోజుకి అంచనాలతో పాటు రూమర్స్ కూడా హల్చల్ చేస్తున్నాయి. అయితే రాంచరణ్ కెరీర్లో పదిహేనవ సినిమానే శంకర్ దర్శకత్వంలో అనేసరికి మెగాఫ్యాన్స్ ఓ రేంజిలో ఖుషి అయిపోతున్నారు. వినయ విధేయ రామ ఎఫెక్ట్ తర్వాత రాంచరణ్ చాలా కేర్ ఫుల్ గా తదుపరి సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ఓవైపు దర్శకధీరుడు రాజమౌళితో ఆర్ఆర్ఆర్ అనే పాన్ ఇండియా మల్టీస్టారర్ మూవీ చేస్తున్నాడు. ఆ మూవీ ప్రస్తుతం చివరిదశలో ఉంది.

అయితే ఆర్ఆర్ఆర్ పూర్తి కాగానే రాంచరణ్ శంకర్ సినిమా షూటింగ్ లో పాల్గొనాలని భావిస్తున్నాడు. నిజానికి చరణ్ ఫ్యూచర్ ప్రాజెక్టులు బట్టే ఎంత జాగ్రత్తగా కెరీర్ బిల్డ్ చేసుకుంటున్నాడో అర్ధమవుతుంది. మరోవైపు శంకర్ తో సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండి సినిమా పై ఊహగానాలతో పాటు సమస్యలు కూడా అదేవిధంగా అల్లుకున్నాయి. డైరెక్టర్ శంకర్ చేతిలో ప్రస్తుతం భారతీయుడు సీక్వెల్ వివాదం నడుస్తుంది. ఇటు చూస్తే రాంచరణ్ మూవీకి సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. గతకొన్ని నెలలుగా శంకర్ భారతీయుడు సీక్వెల్ విషయంలో వివాదాలు ఎదుర్కొంటున్నాడు.

కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా మూవీని భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్నారు. కానీ పలు కారణాల వలన సినిమా షూటింగ్ నిలిచిపోయింది. అయితే ముగిసింది అనుకున్న భారతీయుడు సీక్వల్ వివాదం కోర్టు వరకు వెళ్ళింది. కోర్టులో శంకర్ కు అటు లైకా ప్రొడక్షన్స్ వారికీ హోరాహోరి పోరు జరిగింది. ఇటీవలే సినిమా చేయడానికి అటు శంకర్ ఇటు లైకా సెటిల్మెంట్ చేసుకుంటున్నట్లు వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు ఆ వార్తల్లో నిజమే ఉందని సినీవర్గాలలో టాక్. తాజాగా కోర్టులో వివాదాలు సానుకూలంగా ముగిశాయని.. శంకర్ త్వరలోనే షూటింగ్ ప్రారంభించే దిశలో స్పందించినట్లు సమాచారం. ఈ లెక్కన ఇండియన్-2 మూవీ ఆగష్టులో పట్టాలెక్కానుందట. ఈ సినిమాకు దాదాపు నాలుగైదు నెలల సమయం పడుతుందట. మరి ఈ లెక్కన ఈ ఏడాది రాంచరణ్ సినిమా ప్రారంభం కాకపోవచ్చు అని ఫిల్మ్ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News