స్టేజ్‌పై వెంకటేష్ లైవ్ పెర్ఫార్మెన్స్ వైరల్
వెంకటేష్ హీరోగా ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా విడుదలకు సిద్ధం అయ్యింది.
వెంకటేష్ హీరోగా ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా విడుదలకు సిద్ధం అయ్యింది. జనవరి 14న విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా వెంకటేష్ గత రెండు వారాలుగా బిజీ బిజీగా ఉన్నారు. ప్రతి చోట ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో గత వారం పది రోజులుగా ప్రతి రోజు ఏదో ఒక విషయం ఈ సినిమా గురించి వైరల్ కావడం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు సినిమా ప్రమోషన్‌లో భాగంగా వెంకటేష్ స్టేజ్‌పై వేసిన డాన్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తూ సినిమాపై అంచనాలు మరింత పెంచుతుంది.
సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రమోషన్‌లో భాగంగా వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్, దర్శకుడు అనిల్ రావిపూడి జీ తెలుగు టీవీ ప్రోగ్రాం లో పాల్గొన్నారు. ఆ సమయంలో హీరోయిన్స్‌తో కలిసి వెంకటేష్ వేసిన డాన్స్ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక సీనియర్ హీరో ఈ స్థాయిలో డాన్స్ వేయడం ఆశ్చర్యంగా ఉంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. యంగ్ హీరోల్లో చాలా మంది స్టేజ్‌పై డాన్స్ చేయడానికి సిగ్గు పడతారు, కొందరు కాన్ఫిడెన్స్ లేకపోవడంతో డాన్స్ వేసేందుకు వెనకాడతారు. కానీ వెంకటేష్ మాత్రం అద్భుతంగా స్టెప్స్ వేశారంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.
గత సంక్రాంతికి సైంధవ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి నిరాశ పరిచిన వెంకటేష్ ఈ సారి కచ్చితంగా భారీ విజయాన్ని సొంతం చేసుకోవలని పట్టుదలతో ఉన్నాడు. ఈసారి సినిమాకు పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. అంతే కాకుండా సినిమాలో మంచి వినోదాత్మక కంటెంట్ ఉండటంతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అన్ని వర్గాల వారిని ఈ సినిమా మెప్పిస్తుందనే నమ్మకంను ఆయన వ్యక్తం చేస్తున్నారు. హిట్ కానుంది అని తెలిసిన తర్వాత మరింత జోష్‌తో సినిమా ప్రమోషన్‌లో పాల్గొనాలి అనిపిస్తుంది. ఇప్పుడు వెంకీ అదే జోష్‌తో సినిమా ప్రమోషన్‌లో పాల్గొంటున్నాడని తాజాగా ఆయన చేసిన డాన్స్ చూస్తే అనిపిస్తుంది.
అనిల్ రావిపూడి చేసిన అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. కనుక ఈ సినిమా సైతం కచ్చితంగా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుంది అనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకునే విధంగా సినిమా విడుదల ఉండబోతుంది. ఈ సినిమాకు పోటీగా గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ సినిమాలు ఉన్నా ప్రేక్షకులు మాత్రం సంక్రాంతికి వస్తున్నాం సినిమాను చూసే విధంగా భారీగా ప్రమోషన్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో సినిమా జోరు మామూలుగా లేదు. ఓ రేంజ్‌లో సినిమా గురించి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఓపెనింగ్స్ అదే స్థాయిలో ఉండే అవకాశాలు ఉన్నాయి.