RRR సాంగ్: చెర్రీ-తార‌క్ రియ‌ల్ `దోస్తీ` తెర‌పైకి..!

Update: 2021-08-01 06:30 GMT
2021 మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ఆర్.ఆర్.ఆర్ ప్ర‌కంప‌నాలు కొన‌సాగుతున్నాయి. ఈ సినిమా రిలీజ్ కి ముందే భారీ హైప్ తో హీటెక్కిస్తోంది. తాజాగా ఈ మూవీ నుంచి దోస్తీ ప్ర‌మోష‌న‌ల్ సాంగ్ రిలీజైంది. స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఉదయం విడుదలైన ఈ పాట అంత‌ర్జాలంలో సునామీ సృష్టిస్తోంది. ఈ లిరిక‌ల్ వీడియో నిజ‌మైన స్నేహం ఎంత గొప్ప‌దో ఆవిష్క‌రిస్తూ అద్భుత‌ ప‌ద‌విన్యాసం చ‌క్క‌ని ట్యూన్ తో అల‌రించింది. ఇక పాట‌లో మ‌ర‌క‌త‌మ‌ణి కీర‌వాణి మార్క్ స్ప‌ష్ఠంగా క‌నిపించింది.

ఈ పాట‌లో ఆర్.ఆర్.ఆర్ కి వివిధ భాష‌ల‌కు ప‌ని చేసిన సంగీత ద‌ర్శ‌కుల గాయ‌కుల బృందాన్ని ప‌రిచ‌యం చేయ‌డం ఆస‌క్తిని క‌లిగించింది. ఎం.ఎం.కీరవాణి సారథ్యంలో హేమచంద్ర (తెలుగు)- అమిత్‌ త్రివేది (హిందీ)- అనిరుధ్‌ (తమిళం)- యాసిన్‌ నజీర్‌ (కన్నడ)- విజయ్‌ జేసుదాస్‌ (మలయాళం).. ఇలా ఐదు భాషలకు చెందిన ఐదుగురు సంగీత ద‌ర్శ‌కులు క‌నిపించారు. వీరంతా పాట‌ను ఆల‌పిస్తూ కీర‌వాణితో క‌లిసి క‌నిపించ‌డం ఉత్కంఠ‌ను పెంచింది. ఇక రామ్ చరణ్‌-తారక్ ల స్నేహానికి ప్రతీకగా ఈ పాటను రూపొందించ‌డం మ‌రో హైలైట్. లిరిక‌ల్ వీడియో ముగింపులో చ‌ర‌ణ్ - తార‌క్ కీర‌వాణి భుజాన్ని త‌ట్టిన తీరు ఎమోష‌న్ ని ర‌గిలిస్తుంది.

దర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రాన్ని డీవీవీ దాన‌య్య అత్యంత భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ .. కొమురంభీమ్‌గా తారక్ న‌టిస్తున్నారు. ఇద్ద‌రు స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుల దోస్తీ నేప‌థ్యంలో మూవీ థీమ్ ఆస‌క్తిని క‌లిగించే విధంగా ఉంటుంది. ఈ చిత్రంలో  ఆలియాభట్‌- ఒలీవియా మోరీస్‌-శ్రియ- అజయ్‌ దేవ్ గణ్‌- సముద్రఖని త‌దిత‌రులు న‌టించారు.  రేయ్‌ స్టీవ్ సన్ - ఆలిసన్‌ డ్యూడీ విల‌న్ పాత్ర‌ల్లో క‌నిపిస్తారు. ద‌స‌రా కానుక‌గా అక్టోబర్‌ 13న సినిమా రిలీజ్ కానుంది. తాజాగా దోస్తీ వీడియోతో ఒక్క‌సారిగా అంచ‌నాల్ని పెంచేయ‌డం ఆస‌క్తిక‌రం.



Full View
Tags:    

Similar News