ఆర్‌ఆర్‌ఆర్‌ దోస్తీ : అన్ని భాషల్లోనూ ట్రెండ్డింగ్‌

Update: 2021-08-02 08:30 GMT
టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులతో పాటు ఇతర భాషల ప్రేక్షకులు ఏ రేంజ్‌ లో ఎదురు చూస్తున్నారో తాజాగా మరోసారి క్లారిటీ వచ్చింది. నిన్న స్నేహితుల దినోత్సవం సందర్బంగా విడుదల అయిన పాట కు అనూహ్యంగా స్పందన వచ్చింది. విడుదల అయిన ప్రతి భాషలో కూడా మంచి స్పందన రాబట్టింది. అన్ని భాషల్లో కూడా దోస్తీ పాట ట్రెండ్డింగ్‌ లో నిలిచింది. తెలుగు వర్షన్ ను హేమ చంద్ర ఆలపించగా తమిళ వర్షన్‌ ను అనిరుథ్‌ పాడాడు. అనిరుథ్ వాయిస్ మరియు ఆయన అప్పియరెన్స్ తో పాటకు మరింత బలంను చేకూర్చాడు అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

కీరవాణి సంగీతానికి అన్ని భాషల ప్రేక్షకులు కూడా ఫిదా అవుతున్నారు. అన్ని విధాలుగా దోస్తీ పాట సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ సినిమా పై జనాల్లో ఉన్న అంచనాలను అంతకు మించి అన్నట్లుగా పెంచింది ఈ పాట. అన్ని భాషల ప్రేక్షకులు ఆహా ఓహో అన్నట్లుగా ఈ పాటకు బ్రహ్మరథం పడుతున్నారు. కీరవాణి సంగీతం అంటే ఖచ్చితంగా జక్కన్న మూవీ మ్యూజికల్‌ సక్సెస్‌ అవ్వడం ఖాయం అన్నట్లుగా నమ్మకం అందరిలో ఉంటుంది. అన్నట్లుగానే ఆ సినిమా కూడా మ్యూజికల్‌ హిట్‌ గా నిలువబోతుందని మొదటి పాటతోనే తేలిపోయింది.

మొదటి పాట విజువల్స్ కు కూడా మంచి స్పందన వచ్చింది. అంత మంది దిగ్గజ సింగర్స్ తో పాటు కీరవాణి మరియు ఇద్దరు హీరోలు కూడా పాటలో కనిపించడం వల్ల కన్నుల పండుగ అన్నట్లుగా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఈ పాటకే ఇలా ఉంటే ముందు ముందు రాబోతున్న పాటలు మరియు టీజర్ ట్రైలర్‌ లతో దుమ్ము లేచి పోవడం ఖాయం అంటున్నారు. సినిమాలో ప్రతి ఎలిమెంట్‌ ను అద్బుతంగా తీయడంలో రాజమౌళి కే చెల్లుతుంది.

ఈ సినిమాలో కూడా ప్రతి ఎలిమెంట్‌ ను కూడా అద్బుతంగా తీర్చి దిద్దినట్లుగా చెబుతున్నారు. రికార్డు బ్రేకింగ్‌ వసూళ్ల లక్ష్యంతో ఈ సినిమా అక్టోబర్‌ లో దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. సినిమా షూటింగ్‌ ను ఈ నెలలో ముగించి ఎట్టి పరిస్థితుల్లో అక్టోబర్‌ లో విడుదల చేసేలా ప్లాన్‌ చేస్తున్నారు. రికార్డు బ్రేకింగ్‌ వసూళ్లు సాధించబోతున్న ఈ సినిమా హాలీవుడ్‌ లో కూడా విడుదల చేసేలా ప్లాన్‌ చేస్తున్నారట.
Tags:    

Similar News