ఫారిన్ లేడీకి 100 ₹.. ఇండియన్ లేడీకి 200 ₹ అంటున్న ఆర్జీవీ..!

Update: 2020-06-09 18:19 GMT
సంచలనాలకు మారు పేరైన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఏది చేసినా పబ్లిసిటీ కోసమే అని చెప్తూ ఉంటాడు. తన సినిమాలను ప్రమోట్ చేసుకోవడంలో ఆయన చూపే స్ట్రాటజీ అలానే ఉంటుంది మరి. సినిమా స్టార్టింగ్ మొదలుకొని విడుదల వరకు అన్నీ తానై చూసుకుంటూ పోస్టర్స్, టీజర్స్, తన ట్వీట్స్ ద్వారానే సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేస్తాడు. అలానే సినిమా వాళ్లంతా ఇళ్లలో కూర్చొని ఖాళీగా ఉంటే.. వర్మ మాత్రం బూతు సినిమాలు తీసేశారు. వాటిని ఇప్పుడు ఒక్కొక్కటిగా జనం మీదికి వదులుతున్నాడు. దీని కోసం ఆన్ లైన్ ని అడ్డాగా మార్చుకున్నాడు. ఎవరి ఇంట్లో వారే కూర్చొని సినిమాలు చూసేలా టెక్నాలజీని ఉపయోగించుకొని 'ఆర్జీవీ వరల్డ్ థియేటర్' ను క్రియేట్ చేసాడు. ఈ క్రమంలోనే తన లేటెస్ట్ మూవీ 'క్లైమాక్స్' తో ఆర్జీవీ వరల్డ్ లో వర్మ సృష్టించిన అలజడి తెలిసిందే. 'క్లైమాక్స్' సినిమాని 100 రూపాయలు చెల్లించి ఏటీటీలో చూడండి అంటూ వర్మ ప్రకటించేశాడు. అయినా సరే ఈ సినిమాని ఆన్లైన్ లో దాదాపుగా మూడు లక్షల మందికి పైగా చూశారు అంటే అర్థం చేసుకోవచ్చు వర్మ సినిమాకి ఉండే క్రేజ్. అంటే దాదాపుగా రూ.3 కోట్లకు పైగా సినిమా వసూళ్లు సాధించింది. సినిమా కంటెంట్ చెత్తగా ఉన్నా ట్రైలర్ లో అన్ని రకాల మసాలా ఉన్నట్లు చూపించి ప్రేక్షకుల వీక్ నెస్ ని క్యాష్ చేసుకున్నాడు ఆర్జీవీ.

ఇప్పుడు వర్మ 'క్లైమాక్స్'కు మించిన మరో సినిమాను రెడీ చేసాడు. 'నగ్నం' అనే టైటిల్ తో ఇటీవలే సినిమాను ప్రకటించిన వర్మ దీనికి సంబంధించిన ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశాడు. ఈ సినిమాలో బూతు చరిత్ర కాస్తా ఎక్కువగా ఉన్నట్టుగా కనిపిస్తోంది. నేను రాజమౌళి ని కాదు.. ఇది 'RRR' కాదు ఇది 'NNN' అంటూ టీజర్ ని రిలీజ్ చేసాడు. బూతు కంటెంట్ కి కేరాఫ్ అడ్రస్ గా ఉన్న ఈ టీజర్ ఆ టైపు సినిమాలను కోరుకునే వారిని బాగానే ఆకర్షిస్తోంది. అయితే త్వరలో రాబోతున్న ఈ సినిమాకి టికెట్ ధరను 200 రూపాయలుగా నిర్ణయించాడు. శృంగార తారని పెట్టి 52 నిమిషాల సినిమా తీసి 100 రూపాయలు రేట్ పెట్టిన ఆర్జీవీ.. ఇప్పుడు లోకల్ బ్యూటీని పెట్టి తీసిన చిన్న సినిమాకి 200 రూపాయలు రేట్ పెట్టాడు. 'NNN'కి 200 రూపాయలు పెట్టడానికి రీజన్ గా ''ఫారిన్ లేడీ కంటే ఇండియన్ వుమెన్ రెట్టింపు వాల్యూ కలిగి ఉంటుంది కాబట్టి రెట్టింపు ధర ఫిక్స్ చేశాను'' ట్విట్టర్ లో చెప్పుకొచ్చాడు ఆర్జీవీ. ఈ 'NNN' కూడా 'క్లైమాక్స్' సినిమా మాదిరిగానే ఆర్జీవీ వరల్డ్ - శ్రేయాస్ ఎంటర్టైన్మెంట్ ఏటీటీలో రిలీజ్ కాబోతోందని ప్రకటించారు. మరి ఈ చిన్న సినిమాని 200 రూపాయలు పెట్టి ఎంతమంది చూస్తారో చూడాలి.
Tags:    

Similar News