బిగ్ బాస్ ఓటింగ్.. మానిక్యులేటింగ్..

Update: 2018-07-30 05:17 GMT
సోషల్ మీడియా వచ్చాక స్వేచ్ఛ ఎక్కువైంది. అదే సమయంతో మంచి చెడూ ఆలోచించకుండా ఎదుటి వారిపై విచక్షణ రహితంగా బురదజల్లుతున్నారు. అభిమానం పేరుతో అర్హత లేనివారిని అందలమెక్కిస్తున్నారు. ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలు చూస్తుంటే అమాయకులకు అన్యాయం జరుగుతోందనే వాదన వినిపిస్తోంది.

బిగ్ బాస్ శని - ఆదివారాలు రంజుగా సాగింది. హోస్ట్ నాని శనివారం ఇంటిసభ్యుల తీరు బాగా లేదంటూ శివాలెత్తగా.. ఆదివారం మాత్రం ఆ వేడిని చల్లబరిచేలా సరదాగా సాగించారు. శనివారం ఎపిసోడ్ లో బాబు గోగినేనితో దాదాపు గొడవ పెట్టుకున్నాడు. నాస్తికత్వం పేరుతో రాజమౌళిపై చేసిన కామెంట్లను తప్పుపట్టాడు. అదే సమయంలో రాముడు మంచి బాలుడిలా ఉంటూ గొడవలకు కారణమవుతున్న కౌశల్ వైఖరిని కూడా నాని తూర్పారపట్టారు. ఇక ఆ తర్వాతే అసలు కథ మొదలైంది.

కౌశల్ ను నాని తిట్టాడని సోషల్ మీడియాలో కౌశల్ ఆర్మీ  తదితర ఫ్యాన్స్ గ్రూపులు రెచ్చిపోతున్నాయి. #NaniUnifitorBB2host  పేరుతో ట్రోలింగ్ మొదలు పెడుతున్నారు. ఎన్టీఆర్ తో పోలిస్తే నాని పర్ ఫామెన్స్ బాగా లేదంటూ ప్రచారం చేస్తున్నారు. నిజానికి కౌశల్ ను తిట్టనంత వరకూ నాని ది బెస్ట్. కౌశల్ ను తిట్టాకే అతడిపై వ్యతిరేక ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. ఇలా అభిమానం వెర్రితలలు వేస్తోంది.

ఇక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. బిగ్ బాస్ లోని తమ ఫేమరెట్ కంటస్టెంట్ల ఫ్యాన్స్ గ్రూపులు సోషల్ మీడియాలో చేస్తున్న రచ్చా అంతా ఇంతాకాదు.. ఏకంగా వీరు బిగ్ బాస్ ఓటింగ్ ను కూడా ప్రభావితం చేస్తున్నారంటే పరిస్థితి ఎంత దిగజారిందో అర్థం చేసుకోవచ్చు..

కౌశల్ తో రెండు వారాలు బాగా స్నేహంగా ఉండి అనంతరం ఎలిమినేట్ అయిన సామాన్యుడు నూతన్ నాయుడు కు ఈ వారం అత్యధిక ఓట్లు వేసి తిరిగి బిగ్ బాస్ ఇంటిలోకి పంపారు. ఇందులో పెద్ద క్యాంపెయినే నడిచింది. కౌశల్ ఆర్మీ - కౌశల్ ఫ్యాన్స్ గ్రూపులు నూతన్ కోసం ఓట్ల వాన కురిపించారు. ప్రచారం చేసొ అతడిని గెలిపేందుకు శాయశక్తుల ప్రయత్నించారు. ఇక నూతన్ కూడా తాను వచ్చేసారి జనసేన తరఫున 2019 ఎన్నికల్లో పోటీచేస్తానని లీకులు ఇచ్చాడు. దీంతో పవన్ ఫ్యాన్స్ కూడా పెద్ద ఎత్తున ఓట్లు వేశారు. ఆన్ లైన్ లో అత్యధిక ఫాలోయింగ్ తో చురుకుగా ఉండే పవన్ ఫ్యాన్స్ ధాటికి నూతన్ ఈజీగానే బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. పోయిన సారి కూడా పవన్ తో కలిసి నటించినందుకు  శివబాలాజీ పై పవన్ ఫ్యాన్స్ అత్యధిక ఓట్లు వేసి విజేతగా నిలిపారు.

ఈ మొత్తం ఉందంతంలో నిజమైన అర్హులకు బదులు ప్రభావితం చేసిన వారే బిగ్ బాస్ హౌస్ లోకి రావడం విశేషంగా చెప్పవచ్చు. నూతన్ కంటే ఎక్కువ ఎంటర్ టైన్ మెంట్ ఇచ్చిన భానుశ్రీ - తేజస్వి లాంటి వాళ్లను పక్కనపెట్టి.. రెండు వారాలు స్తబ్ధుగా ఉన్న నూతన్ కు అత్యధిక ఓట్లు పడడాన్ని ఎవ్వరూ జీర్ణించుకోవడం లేదు. ఈ ఓటింగ్ ప్రక్రియలో అభిమానమే పనిచేసిందని.. నిజమైన ఓటింగ్ పడలేదని చాలా మంది విమర్శిస్తున్నారు. ఇలా అభిమానం పేరుతో కురిపించే ఓట్ల వానను బట్టి బిగ్ బాస్ నిర్ణయాలు తీసుకుంటే అంతిమంగా అది షోపై ప్రభావం చూపేట్టే అవకాశం ఉంది. సామాన్యుడిని తీసుకోవడాన్ని ఎవ్వరూ తప్పుపట్టలేదు. కానీ అతడు ఆ ఆరుగురిలో నంబర్ 1 అవునా.? కాదా అన్నదే ఇక్కడ సమస్య. నూతన్ కంటే మెరుగైన కంటెస్టెంట్లను కాదని ఇతడికి ఎలా ఓట్లు పడ్డాయన్నేదే ఇక్కడ ప్రశ్న. అభిమానం పేరుతో జరిగే ఈ అసంబద్ధ ఓటింగ్ తో  అంతిమంగా బిగ్ బాస్ షోపైనే ప్రభావం చూపుతుందంటున్నారు విశ్లేషకులు..
Tags:    

Similar News