మహనీయుడికి అసలైన నివాళి ఇదే

Update: 2016-06-06 04:51 GMT

రామానాయుడు.. టాలీవుడ్ చరిత్రలో ఇప్పటికీ ఎప్పటికీ గుర్తుండిపోయే పేరు ఇది. ఎంతో మంది దర్శకులు - నటీనటులు - టెక్నీషియన్లను తెలుగు సినీ పరిశ్రమకు అందించిన మహనీయుడు. ఇవాళ ఆయన 80వ పుట్టిన రోజు. ఈ సందర్భంగా తండ్రి స్మృతిగా ఓ మెమోరియల్ ను ఏర్పాటు చేశారు ఆయన కుమారుడు దగ్గుబాటి సురేష్. రామానాయుడు స్టూడియోస్ లో ఆయనను ఖననం చేసిన ప్రాంతంలోనే ఇది ఏర్పాటయింది.

'ఆదుకునే చేతులు' అనే అర్ధం వచ్చేలా 'ద నర్చరింగ్ హ్యాండ్స్' అంటూ ఈ స్మృతిఫలకానికి నామకరణం చేశారు. 'మా కుటుంబ సభ్యులను - అనేక మంది టెక్నీషియన్లను మా తండ్రి ఎలా పైకి తీసుకొచ్చారో ఇది గుర్తు చేస్తుంది. అందుకే ఒక మెమోరియల్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం' అంటున్నారు సురేష్ బాబు. హైద్రాబాదాల్ ఈ మెమోరియల్ ను ఏర్పాటు చేస్తుండగా.. విశాఖలోని స్టూడియోలో ఒక మ్యూజియం ఏర్పాటు అయింది.

'రామానాయుడు స్టూడియోస్ బ్యానర్ పై సినీ నిర్మాణం ప్రారంభించిన నాటి నుంచి ఉపయోగించిన అన్ని రకాల ఆర్నమెంట్స్ ఇందులో ప్రదర్శిస్తాం. శ్రీకృష్ణ తులాభారం సమయంలో ఉపయోగించిన దుస్తులు, అప్పట్లో ఉపయోగించిన కెమేరాలు - టెక్నాలజీ లాంటివి కూడా ఈ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంటాయి' అని చెప్పారు సురేష్ బాబు. 'ఆయన ప్రతీ ఒక్కరినీ ప్రేమించారు. మేం తర్వాతి తరాలకు అందించాల్సిన ఎన్నో విలువలను అందరికీ నేర్పారు' అన్నారు వెంకటేష్.
Tags:    

Similar News