దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఒక ఆర్టిస్టును ఎంపిక చేసుకున్నారు అంటే ఆ సెలెక్షన్ ని వేలెత్తి చూపలేరు ఎవరూ. పాత్రకు తగ్గ అభినివేశం.. ఎమోషన్ ని పండించే ప్రతిభ లేకపోతే ఆయన్ని మెప్పించడం కష్టమే. అయితే ఆయన భారీ పాన్ ఇండియా చిత్రం ఆర్.ఆర్.ఆర్ కోసం ఎంచుకున్న క్యాస్టింగ్ విషయమై ఏవైనా తప్పులు చేశారా? అంటూ ఆరాలు మొదలయ్యాయి. ముఖ్యంగా యంగ్ యమ ఎన్టీఆర్ సరసన నటిస్తున్న ఐరిష్ బ్యూటీ ఒలీవియా మోరిస్ సామర్థ్యం ఎంత? నటిగా తన అనుభవం ఎంత? అంటూ అభిమానులు లెక్కలు తీస్తున్నారు.
అసలింతకీ ఒలీవియా క్వాలిఫికేషన్ ఏమిటి? నటిగా తన స్థాయి ఎంత? అన్నది ఆరాతీస్తే తెలిసిన సంగతులు నిశ్చేష్టుల్ని చేస్తున్నాయి. అసలు ఈ అమ్మడి ప్రస్థానం మొదలైంది స్టేజీ డ్రామాలతో. నాటకాలాడే అలవాటుంది. స్టేజీ డ్రామాకు మాత్రమే అలవాటు పడింది. అలాగే అడిషనల్ గా నృత్యంలోనూ ప్రవేశం ఉంది. అదొక్కటి తప్ప హాలీవుడ్ లో బడా స్టార్ అయితే కానేకాదు. మోరిస్ ని ఎంచుకున్నారు అనగానే తనో పెద్ద హాలీవుడ్ స్టార్ అని భావించిన తారక్ ఫ్యాన్స్ గూగుల్ లో వెతికారు. కానీ ఎక్కడా ఆధారం కనిపించలేదు. స్టార్ అయితే తనకంటూ ఓ వీకీ పేజీ కూడా ఉండేది. కానీ అదీ లేకపోవడంతో ఒలీవియా మోరిస్ కి సంబంధించిన సరైన సమాచారం ఏదీ లేదు.
ఇక కొత్తమ్మాయ్ అయినా ఆర్.ఆర్.ఆర్ తో ఈ అమ్మడు వరల్డ్ వైడ్ స్టార్ గా వెలిగిపోవడం ఖాయం. ఒలీవియా తెరపై కనిపించేది కేవలం 20 నిమిషాలు మాత్రమే. నిరూపించుకునేందుకు ఆ సమయం చాలు. కొమురం భీమ్ ని ప్రేమించే బ్రిటీష్ రాకుమారిగా అమ్మడు సత్తా చాటేందుకు ఛాయిస్ ఉంది. ఇది అరుదైన అవకాశం. ఇక ఆర్.ఆర్.ఆర్ లో నటిస్తున్నందుకు పారితోషికం ఇస్తున్నారా? లేదా.. కేవలం అలవెన్సులు మాత్రమేనా? అన్నది కూడా తెలియాల్సి ఉంది. ఆర్.ఆర్.ఆర్ బడ్జెట్ కి పరిమితులు విధించిన తర్వాత ఎంపిక కాబట్టి పారితోషికాన్ని ఆచితూచి ఇస్తారనడంలో సందేహం లేదు.
ఇంతకీ ఒలీవియా పారితోషికం ఎంత? అన్నది తేలాల్సి ఉంది. తనతో పాటే నటిస్తున్న విలన్లు అలసన్ డూడీ.. మేల్ విలన్ రే స్టీవెన్సన్ ప్రస్థానం మాత్రం పెద్దదే. ఆస్కార్ రేంజు సినిమాల్లో నటించారు ఈ ఇద్దరూ. ఇక డూడీ- రేల పారితోషికం ఎంత అన్నది తెలియాల్సి ఉంది. ఆర్టిస్టులుగా సత్తా చాటితేనే అవకాశం కాదు. చాటగలరు అనుకున్న వారికి ఆర్.ఆర్.ఆర్ లో రాజమౌళి అవకాశం ఇచ్చారన్నమాట