`ఓ బేబి` త‌ర్వాత `డ్రీమ్ గాళ్` రీమేక్

Update: 2019-07-06 06:30 GMT
లేడీ ఓరియెంటెడ్ టైమ్ ఇప్పుడిప్పుడే స్టార్ట‌వుతోంది టాలీవుడ్ లో. `యూట‌ర్న్` తో ఓ ప్ర‌య‌త్నం చేసిన స‌మంత ప్ర‌స్తుతం `ఓ బేబి` లాంటి ప్ర‌యోగంతో సాహ‌స‌మే చేసింది. ఈ సినిమాకి క్రిటిక్స్ నుంచి ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ఒరిజిన‌ల్ బాక్సాఫీస్ రిపోర్ట్ ఎలా ఉండ‌నుందో ఈ వీకెండ్ రిపోర్ట్ రావాల్సి ఉంది. అయితే ఈ స‌హ‌సం వెన‌క సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ అధినేత‌లు డి.సురేష్ బాబు- రానా వంటి వారి ప్రోత్సాహం గురించి ఈ సంద‌ర్భంగా గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది.

కొరియ‌న్ సినిమా `మిస్ గ్రానీ` రీమేక్ తెర‌కెక్కించాల‌న్న ఆలోచ‌న డి.సురేష్ బాబు లాంటి పెద్ద‌ల‌కు వ‌చ్చింది కాబ‌ట్టే ఇది సాధ్య‌మైంది. నందిని రెడ్డికి వెన్నంటి నిలిచి ప్రాజెక్టును స‌జావుగా సాగేలా సాయ‌ప‌డ్డారు. అలాగే `దొర‌సాని` (12న రిలీజ్) లాంటి ఆఫ్ బీట్ ఎటెంప్ట్ ఇదే సంస్థ చేస్తుండ‌డం ప్ర‌స్తుతం హాట్ టాపిక్ గా మారింది. జీవిత రాజ‌శేఖ‌ర్ కుమార్తె శివాత్మిక న‌టిస్తున్న లేడీ ఓరియెంటెడ్ మూవీ ఫ‌లితం ఎలా ఉండ‌బోతోంది? అన్న ఉత్కంఠ నెల‌కొంది.

ఈలోగానే సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ కాంపౌండ్ చేస్తున్న మ‌రో ప్ర‌యోగాత్మ‌క సినిమా గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. బాలీవుడ్ క్లాసిక్ `డ్రీమ్ గాళ్‌` కి రీమేక్ గా ప్ర‌స్తుతం ఈ కాంపౌండ్ లో ఓ సినిమా తెర‌కెక్కుతోంది. ఇప్ప‌టికే టీమ్‌ ఆన్ లొకేష‌న్ ఉంది. ఈ చిత్రంలో రాజ్ త‌రుణ్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్నాడు. అనీష్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. రానా స‌మ‌ర్ప‌ణ‌లో సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ ఈ సినిమా క‌థ విష‌యంలో ప్ర‌తిదీ ఎగ్జిక్యూట్ చేసింద‌ట‌. ఇది కూడా కొత్త‌ద‌నం నిండిన క‌థాంశ‌మే. డ్రీమ్ గాళ్ అన్న టైటిల్ లోనే మ్యాట‌రేంటో తెలిసిపోతోంది కాబ‌ట్టి అదే కాంపౌండ్ లో ఈ ప్ర‌యోగం ఎలాంటి ఫ‌లితాన్ని ఇస్తుందో చూడాలి.

    

Tags:    

Similar News