మలయాళ స్టార్ మోహన్ లాల్ కథానాయకుడిగా జీతు జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ `దృశ్యం` ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఈ చిత్రం మొత్తం నాలుగు భాషల్లో రీమేక్ అయింది. తెలుగుతో పాటు కన్నడం..తమిళం.. హిందీ లో రీమేక్ అయింది. అన్ని భాషల్లోనూ చిత్రం ఘన విజయం సాధించింది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ కి అన్ని వర్గాల ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఓ సాధారణ మధ్య తరగతి కుటుంబంలో అనుకోని సంఘటన జరిగినప్పుడు ఆ కుటుంబం ఆ సమస్య నుంచి ఎలా బయట పడింది? అన్న అంశాన్ని హైలైట్ చేస్తూ ఎంతో వాస్తవికంగా తెరకెక్కించారు.
అందుకే అన్ని భాషల్లోనూ అపజమమెరగని చిత్రంగా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీగా కాసుల వర్షం కురిపించింది. అవార్డులు.. రివార్డులతో మోత మోగించింది. ఈ నేపథ్యంలో మోహన్ లాల్-జీతు జోసెఫ్ ద్వయం `దృశ్యం-2` కూడా తెరకెక్కించి దాన్ని సక్సెస్ చేసారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ అయిన సినిమా మంచి విజయం సాధించింది. దీంతో `దృశ్యం-2` ని ఇప్పుడు వెంకటేష్ రీమేక్ చేస్తున్నారు. తొలుత `దృశ్యం` రీమేక్ లో వెంకటేష్ నటించి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. తాజాగా `దృశ్యం` ఇండోనేషియా స్థానిక భాషలోనూ రీమేక్ కి రెడీ అవుతోంది. దీనికి సంబంధించి మేకర్స్ అధికారిక ప్రకటన కూడా చేసారు.
ఫాల్కన్ నిర్మాణ సంస్థ రీమేక్ హక్కుల్ని దక్కించుకుని అక్కడ రీమేక్ చేస్తున్నట్లు వెల్లడించింది. మరి ఇందులో నటీనటులు ఎవరు? దర్శకుడు ఎవరు? అన్న వివరాలు రివీల్ చేయాల్సి ఉంది. ఇండోనేషియాలో భారతీయ చిత్రాలు ఎక్కువగా విడుదలవుతుంటాయి. అక్కడ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. `బాహుబలి` సినిమా తర్వాత తెలుగు సినిమా అక్కడ బాగా వెలుగులోకి వచ్చింది. ప్రభాస్ కి ప్రత్యేకమైన అభిమానులు ఏర్పడ్డారు.
ఇండోనేషియా లో స్థానిక భాషను `బహాసా ఇండోనేషియా` అని పిలుస్తారు. ప్రాథమిక భాష ఇది. ఇండోనేషియా జనాభాలో 94శాతం పైగా మాట్లాడతారు. అయితే ఇది కేవలం 20 శాతం జనాభాకు మాత్రమే ప్రాథమిక భాష. జవానీస్ (జావా) అనేది 30శాతం పైగా జనాభా మాట్లాడే అత్యంత సాధారణ ప్రాథమిక భాష. దృశ్యం ని ఏ భాషలో తెరకెక్కిస్తారు అన్నదానిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.