కిచ్చా సుదీప్ 'మ్యాక్స్'.. తెలుగు ట్రైలర్ చూశారా?
ఈ నేపథ్యంలో ఆయన అప్ కమింగ్ మూవీ, యాక్షన్ థ్రిల్లర్ మ్యాక్స్.. తెలుగులో కూడా విడుదల కానుంది.
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ కు టాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. తెలుగులో పలు సినిమాల్లో నటించి సూపర్ ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్నారు. బ్లాక్ బస్టర్ హిట్ ఈగతో బాగా దగ్గరయ్యారు. ఆ తర్వాత బాహుబలిలో కూడా నటించి మెప్పించారు. అలా పాన్ ఇండియా రేంజ్ లో పరిచయం అయ్యారు.
అయితే ఆయన నటించిన కన్నడ సినిమాలు.. తెలుగులో కూడా సందడి చేస్తున్నాయి. టాలీవుడ్ మూవీ లవర్స్ ను అలరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన అప్ కమింగ్ మూవీ, యాక్షన్ థ్రిల్లర్ మ్యాక్స్.. తెలుగులో కూడా విడుదల కానుంది. విజయ్ కార్తికేయ దర్శకత్వం వహించిన ఆ సినిమా.. త్వరలో థియేటర్లలో సందడి చేయనుంది.
వరలక్ష్మీ శరత్‌కుమార్, సంయుక్త, సుకృత, సునీల్ కీలక పాత్రలు పోషించిన మ్యాక్స్ చిత్రాన్ని వీ క్రియేషన్స్, కిచ్చా క్రియేషన్స్ బ్యానర్స్‌పై కలైపులి ఎస్ థాను నిర్మించారు. డిసెంబర్ 27న థియేటర్లలో రిలీజ్ అవ్వనున్న ఆ సినిమాపై ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ అయింది. పోస్టర్స్ సహా అప్డేట్స్.. మూవీపై పాజిటివ్ హైప్ క్రియేట్ చేశాయి.
ఈ నేపథ్యంలో మేకర్స్ తెలుగు ట్రైలర్ ను రీసెంట్ గా రిలీజ్ చేయగా.. ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. సినిమాపై అంచనాలు పెంచుతోంది. అయితే అర్జున్ మహాక్షయ్ అనే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ లో కిచ్చా సుదీప్ ఓ రేంజ్ లో సందడి చేయనున్నట్లు క్లియర్ గా తెలుస్తోంది.
మా పొలిటికల్ కెరియర్ కు ఈ రాత్రి చాలా ఇంపార్టెంట్ అంటూ వచ్చిన డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమవ్వగా.. సునీల్ కత్తి పట్టుకుని ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత రెండు హత్యలు జరిగినట్లు చూపించారు. ఇంతలో రెండు కత్తులతో హీరో కిచ్చా సుదీప్.. యాక్షన్ సీన్ లో కనిపించారు. అనంతరం ఓ రేంజ్ లో యాక్షన్ సీన్స్ ఉన్నాయి.
అయితే స్టోరీ లైన్ క్లారిటీగా చెప్పని మేకర్స్.. ట్రైలర్ ను మాత్రం ఇంట్రెస్టింగ్ గా కట్ చేశారు. కిచ్చా సుదీప్, వరలక్ష్మీ శరత్ కుమార్ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. డైలాగ్స్ అదిరిపోయాయి. అజనీష్ లోక్ నాథ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే వేరే లెవెల్ అని చెప్పాలి. మొత్తానికి మ్యాక్స్ సినిమా ట్రైలర్.. ఓవరాల్ గా అందరినీ ఆకట్టుకుని దూసుకుపోతోంది. మరి మీరు చూశారా? లేదా?