శంకర్ ని రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్స్ ఎవరు..?

ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా శంకర్ తెలుగులో తాను చేయాలనుకున్న హీరోల గురించి మాట్లాడారు.

Update: 2024-12-23 06:14 GMT

సౌత్ ఇండియా డైరెక్టర్స్ లో పాన్ ఇండియా క్రేజ్ ఉన్న దర్శకుల్లో శంకర్ ఒకరు. ఇప్పుడు కాదు రెండు దశాబ్దాల క్రితంలోనే ఆయన పేరు నేషనల్ వైడ్ గా మారు మోగిపోయింది. శంకర్ సినిమా వచ్చింది అంటే బ్లాక్ బస్టర్ పక్కా అనే రేంజ్ లో ఆయన సినిమాలు ఉండేవి. ఐతే క్రమ క్రమంగా ఆయన గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. ఐ సినిమా నుంచి అది మొదలైంది. మధ్యలో 3 ఇడియట్స్ రీమేక్ కూడా శంకర్ స్థాయి సినిమా కాదనిపించింది. రోబో ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే కానీ 2.ఓ ఆ స్థాయిని అందుకోలేదు.

ఇక ఎన్నో భారీ అంచనాల మధ్య వచ్చిన ఇండియన్ 2 సినిమా డిజాస్టర్ అయ్యింది. అందుకే రాం చరణ్ గేం ఛేంజర్ తో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు శంకర్. సినిమా ఆయన మార్క్ కమర్షియల్ అంశాలతో పాటు సామాజిక అంశం కూడా ఉంటుందని తెలుస్తుంది. గ్లోబల్ స్టార్ చరణ్ తో గేమ్ ఛేంజర్ రాబోతున్న శంకర్ తిరిగి ఫాం లోకి వస్తారని ఫ్యాన్స్ కోరుతున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా శంకర్ తెలుగులో తాను చేయాలనుకున్న హీరోల గురించి మాట్లాడారు.

చిరంజీవి, మహేష్, ప్రభాస్ లాంటి స్టార్స్ తో తాను సినిమాలు చేయాలనుకున్నా కాని కుదరలేదని అన్నారు శంకర్. చిరంజీవితో సినిమా గురించి తెలియదు కానీ శంకర్ 3 ఇడియట్స్ రీమేక్ ని మహేష్ తో చేయాలని అనుకున్నారన టాక్ అప్పట్లో ఉంది. ఇక ప్రభాస్ తో కూడా చేయాలనుకున్నట్టు చెప్పారు. ఐతే శంకర్ సినిమా చేస్తానన్నా వీళ్లు కాదన్నారా.. ఆయన చెప్పిన కథను రిజెక్ట్ చేశారా అని డిస్కషన్స్ జరుగుతున్నాయి.

ఇప్పుడు శంకర్ కాస్త కెరీర్ లో ఫాం తగ్గింది కానీ అప్పట్లో శంకర్ సినిమా అంటే ష్యూర్ షాట్ హిట్ అన్నట్టే ఉండేది. ఆయన దృష్టిలో పడాలని హీరో ఆసక్తి చూపించే వారు. కానీ శంకర్ మాత్రం తాను చిరంజీవి, మహేష్, ప్రభాస్ తో సినిమాలు చేయాలని అనుకున్నా అవి సెట్ అవ్వలేదని చెప్పి షాక్ ఇచ్చారు. ఐతే మహేష్, ప్రభాస్ సంగతి తెలియదు కానీ చిరంజీవికి సరైన కథతో వస్తే ఇప్పటికీ శంకర్ తో చిరు ప్రాజెక్ట్ చేసే ఛాన్సులు ఉన్నాయి.

ఐతే మహేష్, ప్రభాస్ కథలు సెట్ అవ్వక శంకర్ ని కాదంటే చరణ్ మాత్రం శంకర్ నుంచి కాల్ వస్తేనే అదృష్టం అన్నట్టుగా చెప్పుకొచ్చాడు. ఐతే శంకర్ పిలిచినా కథ తమ ఇమేజ్ కి తగినట్టుగా ఉన్నప్పుడే ఏ స్టార్ హీరో అయినా సినిమా చేస్తాడు. మరి అప్పుడు కుదర్లేదు ఫ్యూచర్ లో మహేష్, ప్రభాస్, చిరుతో శంకర్ సినిమాలు చేస్తారేమో చూడాలి.

Tags:    

Similar News