ఈ ఇన్సిడెంట్ సినిమాగా తీస్తే బెటర్

Update: 2017-07-12 04:35 GMT
దాదాపు ప్రతీ చెత్త కంటెంట్ ను సినిమాలుగా తీయడం మనకు ఆనవాయితీ. అందులోనూ సెక్స్ అండ్ మర్డర్ అనేవి తెగ తీసేస్తాం. కాకపోతే నిజంగానే విలువైన విషయాలు ఉన్న కంటెంట్ ను మాత్రం విస్మరిస్తాం. అది సినిమాగా ఆడదు అనుకుంటాం. ఇప్పుడు అమరనాథ్ లో జరిగిన టెర్రరిస్ట్ ఎటాక్ తరువాత.. అక్కడ ఒక బస్సు డ్రైవర్ చూపించిన తెగువ.. ఖచ్చితంగా ఒక సినిమా కథనే తలపించింది. ఇలాంటి హీరోలను మనం వెండితెరపైనే చూస్తుంటాం. పదండి అదేంటో చూద్దాం.

ప్రతి మనిషికి దేశం అంటే గౌరవం ఉంటుంది. మనతోటి మనిషి పై మమకారం ఉంటుంది. అది మొన్న రాత్రి జరిగిన అమరనాథ్ యాత్ర దుర్ఘటన ద్వారా మరోసారి రుజువైంది. అతను ఒక సాధారణ మనిషి తన కుటంబం పోషణ కోసం ఒక చిన్న ట్రావెల్ ఏజెన్సీ లో డ్రైవరు గా పని చేస్తున్నాడు. అయితే నేమి అతనిలో ఆపద వస్తే ఎదుర్కొనే దైర్యం ఉంది పోరాడే శక్తి ఉంది అంతకన్నా ముఖ్యంగా సాటి మనిషి కోసం తన ప్రాణాలు సైతం ఆర్పించే విశాల హృదయం ఉంది. ఒక చీకటి రాత్రిలో  బస్ నడుపుతున్న షేఖ్ సలీం కు ఏవో కాల్పులు వినపడుతున్నాయి. ఎక్కడోలే అనుకునే లోపే అవి అతని బస్కు ఎదురుగుండా వాళ్ళ పైనే కాల్పులు జరుపుతున్నారు అని అర్ధమైంది. అప్పుడతను ఏం చేశాడు? బస్ ఆపి దిగి పారిపోవచ్చు. లేదంటే ఖంగారుపడి ఏదన్నా రాంగ్ టర్న్ కూడా తీసుకోవచ్చు. కాని సలీం అలా చేయలేదు.

ఈ కాల్పులలో తన పక్కనే ఉన్న కొంత మంది ప్రయాణికులు కూడా తీవ్రవాద తుటాలుకు బలైపోయారు అతని కళ్ల ముందరనే. తన ముందే ప్రాణాలు విడిచిన వాళ్ళను చూసి భయపడకుండా.. షేఖ్ సలీం అటువంటి భయంకర పరిస్థితిలో కూడా అతనకు మిగిలిన ప్రాణాలు పోకుండా చూసుకోవాలి అని మొక్కవోని దైర్యంతో దగ్గరలో ఉన్న మిలటరీ క్యాంప్ వరకు డ్రైవ్ చేశాడు. ఈ ప్రాణ పోరాటంలో షేఖ్ సలీంకు కొన్ని గాయాలు కూడా తగిలాయి. రక్తం కారుతున్న తుటాలు తన శరీరాన్ని హింస పెడుతున్నా ఆ నరకాన్ని ఓర్చి మిగతా ప్రయాణికులు ప్రాణాలు రక్షించిన వాడు అయ్యాడు. బస్లో ఉన్న అందరిని రక్షించలేక పోయాన తన ప్రాణాలు పన్నంగా పెట్టి మిగతా ప్రాణాలు కాపాడి కొన్ని కుటుంబాలుకు శోఖ విముక్తి పంచాడు. శత్రు దేశాలుకు మన ఐక్యత ఏంటో తెలియపరిచాడు.

అమరనాథ యాత్రకు వెళ్ళి తిరిగి వస్తున్న యాత్రికలు పై నిన్న రాత్రి తీవ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో 7 మంది ప్రాణాలు కొలిపోగా 19 మంది గాయలుపాలైయారు. బస్ లో  మొత్తం 50 మంది ప్రయాణం చేస్తున్నారు. క్షతగాత్రులు ను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు స్పెషల్ ప్లేన్ పై తీసుకువెళ్ళు హాస్పిటల్లో చేర్చారు. డ్రైవరు షేఖ్ సలీంకు గాయాలు తగిలిన తన ప్రాణాలుకు ఎటువంటి హాని జరగలేదు. షేఖ్ సలీం అనే అతను సౌత్ గుజరాత్ కు చెందిన వల్సాడ్ గ్రామంకు చెందినవాడు. షేఖ్ సలీం దైర్యాన్ని మెంచుకొని జమ్ము కాశ్మీర్ గవర్నమెంట్ 3 లక్షల బహుమానం ప్రకటించింది ఇంకా అమరనాథ దేవాలయం బోర్డు వాళ్ళు 2 లక్షలు బహుమానం ప్రకటించారు.


Tags:    

Similar News