బాలీవుడ్ డ్రగ్స్ కేసు.. టాలీవుడ్ లోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. డ్రగ్స్ కేసులో పలువురు టాప్ హీరోయిన్ల పేర్లు బహిర్గతం కావడంతో ఇక్కడా టెన్షన్ వాతావరణం నెలకొందని ఫిలింనగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక తాజాగా బాలీవుడ్ తో సరిపెట్టకుండా ఎన్.సి.బి ఇటు టాలీవుడ్ పైనా దృష్టి సారించడంతో ఇక్కడా చెమటలతో తడిసిపోతోందన్న గుసగుస హీట్ పెంచుతోంది.
టాలీవుడ్ డ్రగ్స్ కేస్ వివరాలను కూడా ఎన్.సీ.బీ సేకరించిందని మీడియా కథనాలు వస్తున్నాయి. డ్రగ్స్ డీలర్ కెల్విన్ తో పాటు డ్రగ్స్ వాడిన సెలబ్రిటీల జాబితాను హైదరాబాద్ ఎక్సైజ్ శాఖ నుంచి NCB సేకరించి డీప్ గా ఎంటర్ అవుతోందని ప్రముఖ తెలుగు దినపత్రిక ఓ కథనంలో వెల్లడించింది. టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణ అధికారిగా ఉన్న ఎక్సైజ్ ఆఫీసర్ ప్రముఖ మీడియాకి అందించిన వివరాలు షాకిస్తున్నాయి.
టాలీవుడ్ డ్రగ్స్ దందాలో 12 కేసుల్లో ఉన్న అందరి శాంపిల్స్ సేకరించారట. పలువురు వ్యాపారవేత్తల పేర్లు ఇందులో ఉన్నాయి. కొందరు తారలు తమ శాంపిల్స్ ఇచ్చేందుకు నిరాకరించారు. శాంపిల్ ఇచ్చి పునరావాస కేంద్రంలో కౌన్సిలింగ్ తీసుకున్నవారిని ఛార్జ్ షీట్ లో చేర్చలేదని.. దీనిని వ్యతిరేకించిన వారి పేర్లను ఛార్జ్ షీట్ లో దాఖలు చేసామని తెలిపారు. చార్జిషీట్లో పేరు వచ్చిన వారికి సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల వరకు శిక్ష పడుతుంది. 72 మందికి సంబంధించిన శాంపిళ్లను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించాం అని తెలిపారు.
విదేశాల నుంచి డ్రగ్స్ టాలీవుడ్ బాలీవుడ్ కి చేరుకుంటోంది. ఇక్కడ తారల వ్యక్తిగత సహాయకులు దందాకు సహకరిస్తున్నారు. ఆ మేరకు కేసులో పూర్వాపరాలను ఎన్.సి.బి సేకరించింది. దానికి హైదరాబాద్ ఎక్సైజ్ శాఖ సహకరించింది. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఉన్న వారందరి స్టేట్‌మెంట్స్ వీడియో రికార్డింగ్ చేసాం. నాలుగు కేసుల్లో సిట్ విచారణ కొనసాగుతోందని తెలుస్తోంది.