మోహన్ లాల్ నటించిన దృశ్యం సినిమా మలయాళం సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాక్సాఫీస్ వద్ద 50 కోట్ల కలెక్షన్స్ అందుకుని అప్పట్లో మలయాళ ఇండస్ట్రీలో నెంబర్ వన్ సినిమాగా నిలిచింది. ఇక తర్వాత ఆ సినిమాను ఇతర భాషల్లోకి కూడా వరుసగా రీమేక్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల కాలంలో అత్యధిక భాషలో రీమేక్ అయిన సినిమాగా కూడా దృశ్యం నిలవడం విశేషం.
ఇక అదే కథకు కొనసాగింపుగా వచ్చిన దృశ్యం 2తో కూడా మంచి విజయాన్ని అందుకున్నారు. అసలైతే ఆ సినిమాను థియేటర్లో విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కరోనా పరిస్థితుల వలన అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయాల్సి వచ్చింది. అదే తరహాలో తెలుగులో కూడా విడుదలైన విషయం తెలిసిందే. ఇక విభిన్నమైన ట్విస్ట్ లతో దర్శకుడు జీతూ జోసెఫ్ ఈసారి కంక్లూజన్ ఇవ్వనట్లుగా తెలుస్తోంది.
దృశ్యం 3 రానున్నట్లు గత కొంతకాలంగా అనేక రకాల రూమర్స్ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఎట్టకేలకు చిత్ర యూనిట్ సభ్యులు దృశ్యం 3 కూడా ఉంటుంది అని ఒక ప్రత్యేకమైన పోస్టర్ కూడా విడుదల చేశారు. ఇప్పటివరకు కొనసాగిన కథలోనే మరొక కంక్లూజన్ ఇవ్వడానికి చిత్ర యూనిట్ సభ్యులు సిద్ధమయ్యారు. ఇక మూడవ పార్ట్ తోనే సినిమా స్టోరీ ఎండ్ అవుతుంది అని కూడా తెలుస్తోంది.
ఇప్పటికే మెయిన్ స్టోరీ లైన్ సిద్ధం చేసుకున్నాడట. ఇక ప్రస్తుతం తన రైటర్స్ తో కలిసి జోసెఫ్ పూర్తిస్థాయిలో స్క్రిప్టును సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నట్లుగా తెలుస్తోంది. నటీనటుల విషయంలో కూడా ఈసారి కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. మలయాళంలో ఒక ప్రముఖ హీరో ప్రత్యేకమైన పాత్రలో ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఇక మలయాళం లో తీశారు అంటే తప్పకుండా తెలుగులో కూడా చాలా వేగంగా ఈ సినిమాను స్టార్ట్ చేస్తారు అని చెప్పవచ్చు. మరి మూడవ పార్ట్ ఆడియెన్స్ ను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.