బన్నీకి దేవి ఇచ్చిన గిఫ్ట్ అదిరిపోలా.. అంటున్న ఫ్యాన్స్

Update: 2020-04-06 06:15 GMT
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సంబరాలు సోషల్ మీడియాలో ముందుగానే మొదలయ్యాయి. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ సోషల్ మీడియా వేదికగా అడ్వాన్స్ బర్త్డే గిఫ్ట్ ఇచ్చేసాడు. అదేంటంటే ఇంతవరకు అల్లు అర్జున్ నటించిన పాత్రల ఫోటోలను ఒకే ఫొటోలో ఎడిట్ చేసి శుభాకాంక్షలు తెలుపుతూ ఫోటో రిలీజ్ చేసాడు. ఈ సర్ప్రైజ్ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.

ఆ ఫోటోలో దేవిశ్రీ ప్రసాద్ కి అల్లు అర్జున్ పై ఉన్న ప్రేమ - అభిమానం కనిపిస్తుందని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. ఆ ఫోటో పోస్ట్ చేసిన వెంటనే అల్లు అర్జున్ ఫ్యాన్స్ లైక్ చేయడం, షేర్ చేయడం ప్రారంభించారు. అయితే ఇది అడ్వాన్స్ గిఫ్ట్ మాత్రమేనట. అసలు గిఫ్ట్ పుట్టినరోజు నాడు ఇవ్వనున్నాడట దేవి. మరి ఈ ఫోటోతో సర్ప్రైజ్ చేసిన దేవి నెక్స్ట్ ఏమి ఇస్తాడో అని అభిమానులలో ఆసక్తి నెలకొంది.

అంతేగాక అల్లు అర్జున్ పుట్టిన రోజున తన 20వ సినిమా పేరు పోస్టర్ కూడా విడుదల చేయనున్నారు డైరెక్టర్ సుకుమార్ టీమ్. సుకుమార్ తో బన్నీకి ఇది మూడో సినిమా. ఇక రాక్ స్టార్ దేవితో అల్లు అర్జున్ కి ఇది 10వ సినిమానట. వీరిద్దరూ కలిసి ఇంతకుముందు 9 సినిమాలకు పనిచేసారు. 20 సినిమాలలో 10సినిమాలకు దేవి సంగీతం అందించాడంటే అర్థం చేసుకోవచ్చు వీరిద్దరి అనుబంధం ఎలాంటిదో. ఇక డైరెక్టర్ సుకుమార్, దేవి, బన్నీ కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా కావడం మరో విశేషం. మరి ముగ్గురి కాంబినేషన్ హ్యాట్రిక్ కొడుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.
Tags:    

Similar News