రూ.250 తో పూనకాలు తెప్పించిన రాక్ స్టార్‌

Update: 2023-01-04 06:39 GMT
గత ఏడాది పుష్ప పాటలతో మాస్ ఆడియన్స్ కి పూనకాలు తెప్పించిన రాక్‌ స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌ ప్రస్తుతం వాల్తేరు వీరయ్య సినిమా పాటలు మరియు ట్యూన్స్ తో రచ్చ చేస్తున్నాడు. వాల్తేరు వీరయ్య సినిమా నుండి వచ్చిన పాటలు అన్ని కూడా ఆకట్టుకుంటూ సినిమా పై అంచనాలు పెరగడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి అనడంలో సందేహం లేదు.

ఇక తాజాగా చిరంజీవి మరియు రవితేజ కలిసి కనిపించబోతున్న పూనకాలు లోడింగ్‌ పాటను విడుదల చేయడం జరిగింది. చిరంజీవి మరియు రవితేజ గొంతు కలిపిన పూనకాలు లోడింగ్‌ లో ఒక విభిన్నమైన మ్యూజికల్‌ పరికరంను దేవి శ్రీ ప్రసాద్‌ వినియోగించడం జరిగింది. పూనకాలు లోడింగ్ లిరికల్‌ వీడియోలో దేవి శ్రీ ప్రసాద్ దాన్ని చూపించడం జరిగింది.

సినిమా యొక్క ప్రెస్ మీట్ సందర్భంగా దేవి శ్రీ ప్రసాద్‌ పూనకాలు లోడింగ్‌ పాటలో వాడిన ఆ వాయిద్య పరికరాల గురించి వివరించారు.

తాను ఏ కొత్త ప్రదేశానికి వెళ్లినా కూడా అక్కడ కొత్త కొత్త మ్యూజిక్‌ పరికరాలు కొనుగోలు చేసి తీసుకు రావడం జరుగుతుంది. నా స్టూడియో లో అన్ని ఉంటాయి. అలా ఒక సారి గోవా వెళ్లిన సమయంలో దాన్ని తీసుకున్నాను.

గోవాలో ఒక మ్యూజికల్‌ ఇన్స్ట్రుమెంట్స్ షాప్ కు వెళ్లిన సమయంలో చిన్న పిల్లలు ఆడుకునే బొమ్మల వద్ద గ్రీన్ కలర్‌ లో పెద్దగా అది కనిపించింది. దాని నుండి ఒకే సౌండ్ వస్తుంది. అయినా కూడా నాకు భలే అనిపించి తీసుకు వచ్చాను. 250 రూపాయలతో ఆ బూరు ను దేవి శ్రీ ప్రసాద్‌ కొనుగోలు చేయడం జరిగిందట.

ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అందరి ముందు దాన్ని చూపిస్తాను అన్నాడు. ఆ బూర నుండి పూనకాలు లోడింగ్‌ పాటలోని కీ మ్యూజిక్ ను వాయించడం దేవి శ్రీ ప్రసాద్‌ కే సాధ్యం అయ్యింది. చేతిలో ప్రతిభ ఉండాలే కానీ ఏ మ్యూజిక్‌ పరికరం నుండి అయినా అధ్బుతమైన సంగీతాన్ని రాబట్టవచ్చు అని రాక్ స్టార్‌ దేవి శ్రీ ప్రసాద్‌ పూనకాలు లోడింగ్‌ తో నిరూపించాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.Full View



Tags:    

Similar News